
తెలంగాణ వచ్చినా దొరల పాలనే: తమ్మినేని
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సాధించు కున్నా.. దొరల పాలనే సాగుతోం దని టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మంలో తెలంగాణ ప్రజా, సామాజిక సంఘాల ఐక్య వేదిక (టీమాస్) జిల్లా సదస్సు గురువారం నిర్వ హించారు. తమ్మినేని మాట్లాడుతూ ప్రజ లు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లని చెప్పారు. గద్దర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 93% అట్టడుగు కులాల ప్రజలు ఉన్నా.. 7% ఉన్న కులాల వారే పాలన సాగిస్తున్నారన్నారు. నాడు జీఎస్టీ మంచిదే అంటూ మద్దతు పలికిన కేసీఆర్.. నేడు ప్రభుత్వ ప్రాజెక్టులపై పన్నుల భారం పడేసరికి జీఎస్టీపై పోరాడుతానని చెబుతున్నారన్నారు. టఫ్ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన పారదోలేందుకు ప్రజలను సమీకరించాలన్నారు.