కాంగ్రెస్, బీజేపీల్లో చేరొద్దు | Telangana: Tammineni Veerabhadram Comments On Congress And BJP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీల్లో చేరొద్దు

Published Thu, Jan 5 2023 1:48 AM | Last Updated on Thu, Jan 5 2023 1:48 AM

Telangana: Tammineni Veerabhadram Comments On Congress And BJP - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఖమ్మం జిల్లా సంస్కృతి, విలువ లను కలుషితం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, విద్వేష భావాలు పెంచే రాజకీయాల వైపు వెళ్లవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ నేతలకు సూచించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హడావుడి చేసిన వారందరూ తనకు మిత్రులేనని, వారంతా బీజేపీ, కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు మీడియాలో వార్తలు రావడం దురదృష్టకరమన్నారు.

ముస్లింలు ఎక్కువ ఉన్న తెలంగాణలో బీజేపీ ఎదిగితే సమాజంలో మతఘర్షణలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాటిలైట్‌ ఆధారంగా చేస్తున్న పోడు భూముల సర్వే చట్టవిరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement