
తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: ఉత్తమ్
సాక్షి, వరంగల్: భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత, తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుల కోసం చట్టాలు, భూసంస్కరణలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. గొత్తికోయల పై దాడి చేయడం అమానుషమని,దీనికి కారకులైన ప్రతిఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ...
2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాల పేరుతో నాణ్యత లేని పనులు చేసి, డబ్బులు దోచుకుంటుందని ఆరోపించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో వి.హన్మంతరావు, ఏఐసీసీ ఎస్సీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.