కేస్లాపూర్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్
ఇంద్రవెల్లి : రైతుల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రైతుబంధు పథకం అమలు చేసి ఖరిఫ్‌లో ఎకరానికి రూ.4000 వేలు, రబిలో రూ.4000 అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం రెండో రోజు మండలంలోని కేస్లాపూర్, దన్నోర.కే, గట్టేపల్లి, ఇంద్రవెల్లి.కే రెవేన్యూ గ్రామల్లో చెక్కుల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేస్లాపూర్ గ్రామానికి సందర్శించి చేసిన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వన్ని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి రూ.4వేలు అందించడంతో పాటు కల్యాణలక్ష్మీ, పింఛన్ పథకం, కేసీఆర్ కిట్టు, ఇంటింటికి నల్ల తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు. ఆదేవిధంగా దన్నోర.కే గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కేంద్రాన్ని జిల్లా పర్యవేక్షకులు సుధాకర్‌రెడ్డి, పుల్లాయ్య సందర్శించి చెక్కుల పంపిణీ కార్యక్రమన్ని పరిశీలించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ శీవ్‌రాజ్, ఎంపీటీవో రమాకాంత్, జెడ్పిటీసీ సంగీత, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్‌రావ్, సర్పంచ్‌లు మెస్రం నాగ్‌నాథ్, జాధవ్ జముననాయక్, కోరెంగా గాంధారి, పెందోర్ అనుసూయ, మండల రైతు సమన్వయ కర్త తోడసం హరిదాస్, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సుపీయన్, టీఆర్‌ఎస్ నాయకులు నగేష్, అంజద్ తదితరులున్నారు.
టీఆర్‌ఎస్‌తోనే రైతులకు స్వర్ణయుగం
ఖానాపూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని రైతుకు స్వర్ణయుగం రానుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బీర్నంది, సోమర్‌పేట్‌తో పాటు పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హజరై మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మేనిపెస్టోలో లేని కళ్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి సునీత, ఏఎంసీ చైర్మెన్ నల్ల శ్రీనివాస్, సర్పంచ్‌లు జక్కుల నవీన్‌యాదవ్, సుతారి రాజేశ్వర్, ఎంపీటీసీ దర్శనాల వెంకటేశ్, ఖానాపూర్, పెంబి టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, పుప్పాల శంకర్, మండల నోడల్ అధికారి విజయ్‌కుమార్, తహసీల్దార్ ఆరె నరేందర్, ఏడీఏ ఇబ్రహిం అనీఫ్, ఏవో ఆసం రవి, నాయకులు గోవింద్, పురంశెట్టి భూమేశ్, శ్రీదర్‌గౌడ్, అశోక్‌రావు, కిషన్, విక్రమ్‌నాయక్, ఎల్లయ్య, సుధాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment