mla rekha naik
-
ఉకో మేడం...కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
ఖానాపూర్ లో నువ్వా నేనా..
నిర్మల్: ఓ దిక్కు దట్టమైన అడవులు, ఎత్తయిన గుట్టలు, మరో దిక్కు గోదారి పరవళ్లు, కడెం, కవ్వా ల్ అందాలు.. ఎన్ని చీకట్లున్నా వీటన్నింటి మధ్యే బ తుకుతున్న అడవిబిడ్డలు.. ఇలా స్వచ్ఛమైన పచ్చని ప్రకృతి అందాలతో పెనవేసుకున్నట్లుంటుంది ఖా నాపూర్ నియోజకవర్గం. రాష్ట్రంలో స్వల్పంగా ఉన్న ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఇదొకటి. అందుకే ఇక్కడ నేతల మధ్య పోటాపోటీ. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రానుండటంతో రోజురోజుకూ ఖానా పూర్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ ‘కారు’ ఓవర్ లోడ్ అవుతోంది. ప్రస్తుతం అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఉన్నా.. ఆమెకు ఈసారి టికెట్ రాదంటూ అదే పార్టీ నుంచి మరో నలుగురు ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. ఎవరికి వారు ఈసారి తామే బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘నేను లోకల్– నువ్వు నాన్‌లోకల్..’ అంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం కంటే స్వపక్షంలో ఉన్నవాళ్లే ఒకరి పై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఎస్టీ రిజర్వుడ్ కావడంతో.. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 2,05,751 మంది ఓటర్లు ఉండగా ఇందులో అధికశాతం గిరిజనులే. మండలాల వారీగా ఆదివాసీ, లంబాడాల ప్రాబల్యం ఉంటుంది. ఎన్నికల్లో నేతల గెలుపోటములను నిర్ణయించేది వీరే. రాష్ట్రంలో కేవలం తొమ్మిది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌తో పాటు ఆసిఫాబాద్, బోథ్ ఉన్నాయి. ఇందులో ఖానాపూర్ ప్రత్యేకం. ఈ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, పెంబి మండలాలు నిర్మల్‌లో, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాలు ఆదిలాబాద్‌లో, జన్నారం మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. నాన్ లోకలే.. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల సమయంలో ఎక్కువగా చర్చలకు వచ్చే విషయం లోకల్–నాన్‌లోకల్ గురించే. ఇక్కడ స్థానిక నేతలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వాళ్లూ వచ్చి పోటీ చేయడం ప్రత్యేకం. తాజాగా ఇదే అంశం స్థానికులైన నాయకులు లేవనెత్తుతున్నారు. ఇక్కడి ప్రజలకు నిస్వార్థంగా సేవచేసేది స్థానికులేనంటూ జనాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం జగిత్యాల జిల్లాకు చెందినవారు. ఈసారీ సీటుకోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో కూడా స్థానికేతర నేతలు ఉ న్నారు. ఇటీవల జోరుగా ప్రజల్లోకి వెళ్తున్న జాన్సన్నాయక్ది కూడా జగిత్యాల జిల్లా మెట్పల్లి. ఉట్నూర్‌లో సెటిలైన ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం. ఇది ఆసిఫాబాద్ నియోజకవర్గంలోకి వస్తుంది. కొన్ని దఫాలుగా ఖానాపూర్ నియోజకవర్గంలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందిన నేతలే ఎక్కువగా పోటీలో ఉంటున్నారు. ఇందుకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడం, నియోజకర్గాలు తక్కువగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. నేనంటే నేనే.. ఖానాపూర్ నియోజకవర్గంలో ‘కారు’ స్పీడ్‌గానే దూసుకుపోతోంది. తొలిసారి 2004 ఎన్నికల్లో అజ్మీరా గోవింద్‌నాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో గులాబీపార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపుపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ఆశతో చాలామంది అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురు కూడా లంబాడ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ► ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్ రెండుసార్లు గెలిచిన తనకే మూడోసారి సీటు ఇస్తారని చెబుతున్నారు. సీఎం కూడా సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ► హైదరాబాద్ కలెక్టర్‌గా చేసిన శర్మన్ చౌహాన్ సైతం పార్టీ పెద్దలతో తనకున్న సంబంధా ల మేరకు తనకే టికెట్ ఖాయమంటున్నా రు. ఇప్పటికే నియోజకవర్గంలోని మా రుమూల గ్రామాల్లోకి సైతం వెళ్తూ నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ► రాజ్యసభ ఎంపీ సంతోష్‌రావు ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కన్వీనర్‌గా ఉన్న పూర్ణచందర్‌నాయక్ సైతం గ్రామగ్రామానికి వెళ్తున్నారు. ఎంపీ అండతో టికెట్ తనకే ఇస్తారన్న ప్రచారం ప్రజల్లో ఉంది. ►ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జాన్సన్‌నాయక్ ఎట్టి పరిస్థితుల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్‌కు దగ్గరి మిత్రుడని, ఆయనకే టికెట్ వస్తుందని తన అనుచరులు చెబుతున్నారు. ► ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ జనార్దన్ రాథోడ్ సైతం తనకున్న సంబంధాల మేరకు టికెట్ తనకే ఇస్తారన్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నారు. -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణాలో..
ఉట్నూర్(ఖానాపూర్): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ అన్నారు. కేసీఆర్ చేపట్టిన పథకాలను భారతదేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు చేపట్టిన కేసీఆర్ సేవాదళ్ యాత్ర ఆదివారం రాత్రి ఉ ట్నూర్ చేరుకుంది. యాత్ర సభ్యులు రాత్రి ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలో గల విశ్రాంతి భవన్లో బస చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో మహ్మద్ అమీర్ మాట్లాడుతూ కేసీఆర్ పథకాలను భారతదేశ వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు తాము యాత్ర చేపట్టామని తెలిపారు. దేశంలోని 11 రాష్ట్రాల్లో 5 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేశామని ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నామని తెలిపారు. జూన్ 16న తమ యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌పై అభిమానంతో సైకిల్‌పై యాత్ర ప్రారంభించి రాష్ట్రాలు తిరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంత ఆశారెడ్డి, సేవాదల్, రాజు, శ్రావణ్‌కుమార్, శకిల్, పాషాభాయ్, భాను, భరత్ కనకరాజు, పంద్ర జైవంత్‌రావు, అజీమొద్దిన్, ధరణిరాజేశ్, షౌకత్ అలీ, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఇంద్రవెల్లి(ఖానాపూర్) : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. ఇంద్రవెల్లి మండలం గిన్నేర గ్రామపంచాయతీ పరిధిలోని తుమ్మగూడ, సమాక గ్రామాలకు పంచాయతీరాజ్ శాఖ రూ.1 కోటి 4లక్షల, 50 వేలతో బీటీ రోడ్డు మంజూరు చేయగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రోడ్డు విస్తీర్ణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుం దన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దేవ్‌పూజే సంగీత, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్‌రావ్, సర్పంచ్‌లు కనక తుల్సిరాం, పెందో ర్ దేవుబాయి, ఆడే విజయ, ఎంపీటీసీ కనక హనుమంత్‌రావ్, టీఆర్ఎస్ నాయకులు తుమ్మగూడ, సమాక గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట ఉట్నూర్‌రూరల్(ఖానాపూర్) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కామాయిపేట్, లక్కారం గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. గ్రామానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఖానా పూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్ మర్సుకోల తిరుపతి, వైస్ ఎంపీపీ సలీమొద్దీన్, ఎంపీటీసీ రమేశ్, మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు «అజీమొద్దీన్, ధరణిరాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధికే ‘రైతుబంధు’ చెక్కులు
ఇంద్రవెల్లి : రైతుల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రైతుబంధు పథకం అమలు చేసి ఖరిఫ్‌లో ఎకరానికి రూ.4000 వేలు, రబిలో రూ.4000 అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం రెండో రోజు మండలంలోని కేస్లాపూర్, దన్నోర.కే, గట్టేపల్లి, ఇంద్రవెల్లి.కే రెవేన్యూ గ్రామల్లో చెక్కుల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేస్లాపూర్ గ్రామానికి సందర్శించి చేసిన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వన్ని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి రూ.4వేలు అందించడంతో పాటు కల్యాణలక్ష్మీ, పింఛన్ పథకం, కేసీఆర్ కిట్టు, ఇంటింటికి నల్ల తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు. ఆదేవిధంగా దన్నోర.కే గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కేంద్రాన్ని జిల్లా పర్యవేక్షకులు సుధాకర్‌రెడ్డి, పుల్లాయ్య సందర్శించి చెక్కుల పంపిణీ కార్యక్రమన్ని పరిశీలించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ శీవ్‌రాజ్, ఎంపీటీవో రమాకాంత్, జెడ్పిటీసీ సంగీత, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్‌రావ్, సర్పంచ్‌లు మెస్రం నాగ్నాథ్, జాధవ్ జముననాయక్, కోరెంగా గాంధారి, పెందోర్ అనుసూయ, మండల రైతు సమన్వయ కర్త తోడసం హరిదాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సుపీయన్, టీఆర్ఎస్ నాయకులు నగేష్, అంజద్ తదితరులున్నారు. టీఆర్ఎస్తోనే రైతులకు స్వర్ణయుగం ఖానాపూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని రైతుకు స్వర్ణయుగం రానుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బీర్నంది, సోమర్‌పేట్‌తో పాటు పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హజరై మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మేనిపెస్టోలో లేని కళ్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి సునీత, ఏఎంసీ చైర్మెన్ నల్ల శ్రీనివాస్, సర్పంచ్‌లు జక్కుల నవీన్‌యాదవ్, సుతారి రాజేశ్వర్, ఎంపీటీసీ దర్శనాల వెంకటేశ్, ఖానాపూర్, పెంబి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, పుప్పాల శంకర్, మండల నోడల్ అధికారి విజయ్‌కుమార్, తహసీల్దార్ ఆరె నరేందర్, ఏడీఏ ఇబ్రహిం అనీఫ్, ఏవో ఆసం రవి, నాయకులు గోవింద్, పురంశెట్టి భూమేశ్, శ్రీదర్‌గౌడ్, అశోక్‌రావు, కిషన్, విక్రమ్‌నాయక్, ఎల్లయ్య, సుధాకర్ ఉన్నారు. -
స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట
లెజిస్లేటివ్ కమిటీ చైర్పర్సన్ అజ్మీరా రేఖానాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్ : స్త్రీ శిశు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తోందని మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ విభాగం లెజిస్లేటివ్ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మంగళవారం కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. రేఖానాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు మరిత పటిష్టం కావాల్సి ఉందన్నారు. వాటికి సొంత భవనాలను అందుబాటులోకి తేవాలన్నారు. సిబ్బందికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయన్నారు. మౌలిక వసతుల లేమి నెలకొందన్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. ‘కలెక్టర్ కరుణ గారూ మా(ఆదిలాబాద్) జిల్లాకు రండి. మీ లాంటి అధికారులు ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది’ అని రేఖానాయక్ వ్యాఖ్యానించారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న మాతా, శిశు సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా మేడారం సమ్మక్క, సారలమ్మ, బతుకమ్మలు, బోనాలు, పౌష్టికాహారం, బాలికా సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై ఏర్పాటుచేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మంగపేట ప్రాజెక్టు యువత చేసిన ఆదివాసీ నృత్యాలు అలరించాయి. కమిటీ సభ్యులు పురాణం సతీష్‌కుమార్, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, రాంచంద్రారెడ్డి , ఐసీడీఎస్ జేడీ, డీడీ, పీడీ, పలువురు సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నార్నూర్(జైనూర్) : ఎంతో చరిత్ర కలిగిన మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ అన్నారు. ఆదివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సహాయ మంత్రి లక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ హైమన్‌డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద సంప్రదాయబద్ధంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన మానవ పరిణామక్రమ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. హైమన్‌డార్ఫ్ వర్ధంతిని అధికారింగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దంపతులను ఎప్పటికీ మరువలేమని అన్నారు. గ్రామంలో రూ.6కోట్లతో ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు సహాయ మంత్రి కోవ లక్ష్మి తెలిపారు. కొమురం భీమ్ స్వగ్రామమైన జోడేఘాట్‌ను రూ.25 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదారాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆదివాసీల కోసం ఆదివాసీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించిందని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో పెందూర్ భీము, ఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు, ఆర్డీవో ఐలయ్య, ఎంపీడీవో దత్తరాం, తహశీల్దార్ వర్ణ, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, ఎంపీపీ కొడప విమలప్రకాష్, కోఆప్షన్ సభ్యులు సబుఖాన్, ఏజెన్సీ ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి, సర్పంచులు భీంరావ్, బొంత ఆశరెడ్డి, లక్ష్మణ్, ఆదివాసీ సంఘాల నాయకులు లక్కేరావ్, వెడ్మా బొజ్జు, సీతారామ్, అంబాజీ, ఐటీడీఏ మాజీ చైర్మన్ అర్జు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్రావ్, రాయ్‌సెంటర్ జిల్లా మెడి మేస్రం దుర్గు తదితరులు పాల్గొన్నారు.