దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణాలో.. | KCR Sevadal Bicycle Trip | Sakshi
Sakshi News home page

దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణాలో..

Published Tue, Jun 19 2018 2:33 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

KCR Sevadal Bicycle Trip - Sakshi

ఉట్నూర్‌ నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌ 

ఉట్నూర్‌(ఖానాపూర్‌): దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కేసీఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అమీర్‌ అన్నారు. కేసీఆర్‌ చేపట్టిన పథకాలను భారతదేశ వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు చేపట్టిన కేసీఆర్‌ సేవాదళ్‌ యాత్ర ఆదివారం రాత్రి ఉ ట్నూర్‌ చేరుకుంది.

యాత్ర సభ్యులు రాత్రి ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలో గల విశ్రాంతి భవన్‌లో బస చేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో మహ్మద్‌ అమీర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పథకాలను భారతదేశ వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు తాము యాత్ర చేపట్టామని తెలిపారు.

దేశంలోని 11 రాష్ట్రాల్లో 5 వేల కిలోమీటర్లు యాత్ర పూర్తి చేశామని ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకున్నామని తెలిపారు. జూన్‌ 16న తమ యాత్ర ముగుస్తుందన్నారు. అనంతరం ఖానాపూర్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌పై అభిమానంతో సైకిల్‌పై యాత్ర ప్రారంభించి రాష్ట్రాలు తిరగడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బొంత ఆశారెడ్డి, సేవాదల్, రాజు, శ్రావణ్‌కుమార్, శకిల్, పాషాభాయ్, భాను, భరత్‌ కనకరాజు, పంద్ర జైవంత్‌రావు, అజీమొద్దిన్, ధరణిరాజేశ్, షౌకత్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement