
తెలంగాణలో నవశకానికి నాంది
తెలంగాణలో నవశకానికి దసరా పండుగ రోజున శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: తెలంగాణలో నవశకానికి దసరా పండుగ రోజున శ్రీకారం చుట్టారు. విజయదశమి పర్వదినం నాడు తెలంగాణ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెర లేచింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఒకేసారి 21 జిల్లాలను టీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది. సిద్ధిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మిగతా జిల్లాలను ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ప్రారంభించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. జగిత్యాల- డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
2. వరంగల్ రూరల్- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
3. రాజన్న(సిరిసిల్ల)- మంత్రి కేటీఆర్
4. జనగామ- మండలి చైర్మన్ స్వామిగౌడ్
5. జయశంకర్- అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
6. మెదక్- డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
7. యాదాద్రి- హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
8. పెద్దపల్లి- మంత్రి ఈటల రాజేందర్
9. కామారెడ్డి- మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
10. మంచిర్యాల-మంత్రి పద్మారావు గౌడ్
11. వికారాబాద్- మంత్రి మహేందర్ రెడ్డి
12. ఆసిఫాబాద్- మంత్రి జోగు రామన్న
13. సూర్యాపేట-మంత్రి జగదీశ్ రెడ్డి
14. కొత్తగూడెం-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
15. నిర్మల్-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
16. వనపర్తి-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి
17. నాగర్ కర్నూలు- మంత్రి జూపల్లి కృష్ణారావు
18. మహబూబ్ నగర్- మంత్రి చందూలాల్
19. జోగులాంబ: మంత్రి లక్ష్మారెడ్డి
20. మేడ్చల్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్