సూర్యాపేట : వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. రెండళ్ల పాలనలోనే చేసి చూపించామని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని మైనార్టీ గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం వస్తే ఏం వస్తుందని ఎద్దేవా చేసిన వారున్నారని.. కానీ రాష్ర్టం వస్తే బంగారు తెలంగాణఅవుతుందని అప్పుడే కేసీఆర్ చెప్పారన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకునేలా పాలన సాగిస్తున్నారన్నారు.
ఊహించిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పా రు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. మోదీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురిం చి మాట్లాడుతున్నారని తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్య ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే కేసీఆర్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, వైస్ చైర్‌పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆర్డీఓ కిషన్‌రావు, ఈడీ ఎండీ సలీంపాషా, ఓఎస్‌డీ సిరాజుల్లాఖాన్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, తహసీల్దార్ మహమూద్‌అలీ, కమిషనర్ వడ్డె సురేందర్, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్ర కాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, కెక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, ప్రిన్సిపాల్ షేక్ జానిమియా, పి.స్వరూపారాణి, కరుణాకర్, మండాది గోవర్ధన్‌గౌడ్, మీర్ అక్బర్ పాల్గొన్నారు.
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
Published Sat, Jul 2 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement