తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం(ఫైల్‌ఫొటో)
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం రాజన్న సిరసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు భూకబ్జాలు, ఇసుక మాఫియా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీజేఎస్ ఎవరితోను పొత్తు పెట్టుకోదని, స్వతంత్రంగా ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.
దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వం ప్రజలు, రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని కోదండరాం విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. ఆ భయంతోనే టీజేఎస్ సభలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే సహించలేదని, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment