
వెల్లంకిలో సీపీఎం నేతల భిక్షాటన
అప్పుల బాధతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంక్షేమానికి తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ : అప్పుల బాధతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంక్షేమానికి తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారాములతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.