Thammineni Veerabhadram
-
విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి
-
‘కేసీఆర్ దిగిరా.. లేదంటే తడాఖా చూపిస్తాం’
సాక్షి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ఆర్టీసీ విలీనం హామీనే ఇప్పుడు కార్మికులు అడుగుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతునిస్తూ ఆయన మట్లాడారు. ఈ క్రమంలో గత 14 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది.. చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి ప్రజాస్వామ్యబద్దంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. కార్మికులు అడుగుతున్న కోర్కెలు అన్ని న్యాయమైనవని, ఉద్యోగ భద్రతతో పాటు సంస్థని కాపాడండని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం ఈ సమ్మె జరుగుతుందని.. రేపు జరగబోయే రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ బంద్‌లో యావత్ సమాజం పాల్గోని ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ దిగిరా లేదంటే ఎర్రజెండా తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటు వామపక్ష విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతుని ప్రకటించాయని తెలిపారు. ఈ నెల 19 తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించి.. ఆర్టీసీ సమ్మెను సకల జనుల సమ్మెగా మారుస్తామని తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. -
‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది తమ పార్టీయేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా యువజన సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ మను ధర్మ శాస్త్రాన్ని మాని వర్ణ వ్యవస్థను వీడాలన్నారు. అప్పుడే అన్ని వర్గాల వారిని కలుపుకొని పోగలరంటూ హితబోధ చేశారు. మను ధర్మ శాస్త్రానికి తాము వ్యతిరేకమని, రాబోవు రోజుల్లో మను ధర్మశాస్త్రాన్ని కాలబెడతాం దీనికి బీజేపీ సమర్థిస్తుందా? వ్వతిరేకిస్తుందా? అంటూ సవాలు విసిరారు. రాష్ట్రంలో పరువు హత్యలను తగ్గించడానికి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకొవట్లేదని, ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క హామీని నేరవెర్చక పోగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ విమర్శించారు. నాడు తెలంగాణ ప్రజలను 'ఆంధ్ర పాలన వస్తుందని భయపెట్టి' అధికారం చేపట్టారని దుయ్యబట్టారు. -
బాబు, రాహుల్ కూటమిని అంగీకరించం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీని ఓడించడమే తమముందున్న లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు తదితరుల కూటమిని ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లను ఓడించాలనే సీపీఐ, సీపీఎం సంయుక్త వైఖరితో ముందుకెళ్తాయని.. అలాగని రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బహిరంగంగా బలపరచబోమని తమ్మినేని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై తమ్మినేనితో సాక్షి ఇంటర్వ్యూ విశేషాలు. బీఎల్ఎఫ్ను కొనసాగిస్తాం తెలంగాణలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. భవిష్యత్‌లో రాష్ట్రంలో టీఆర్ఎస్కు బలమైన ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ ప్రమేయం ఉండొద్దన్న సీపీఐ షరతుకు మేం అంగీకరించాం. అసెంబ్లీ ఎన్నికలపుడు ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం నినాదంతో మిగతా పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేశాం. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీచేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి ఏకపక్షంగా మద్దతిచ్చే పరిస్థితి లేదు. మేం పోటీచేయని సీట్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలకు మద్దతివ్వాలనే విషయం బాహాటంగా ఉండదు. ఆయా స్థానాల్లోని పరిస్థితిని బట్టి వ్యవహరిస్తాం. గెలిచే అవకాశాల్లేకపోయినా! లోక్‌సభ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు విజయావకాశాలు ఎక్కడా లేకపోయినా.. పోటీచేయాలని నిర్ణయించాం. సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు ఖరారులో కొంత ఆలస్యమైంది. ఇరుపార్టీలు పోటీచేస్తున్న నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మినహాయించి మిగతాచోట్ల ఎవరికి మద్దతివ్వాలనే దానిపై రెండుపార్టీలు ఒక నిర్ణయానికి రావాలని, లేని పక్షంలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో తమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం. జనసేన, బీఎస్పీలతోపాటు బీఎల్ఎఫ్లో భాగంగా ఉన్న ఎంపీసీఐ (యూ), ఎంబీటీ, బీఎల్పీ అభ్యర్థులను బలపరిచే విషయాన్ని సీపీఎం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా టీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికంగానే ఉంది. కుటుంబపాలన ను కొనసాగిస్తోంది. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాల ద్వారా టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ పథకాలతో సానుకూలత ఏర్పడింది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ గెలిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగా ణ ఎన్నికల రంగంలోకి దిగడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఆర్థికస్థితి దయనీయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయ నీయంగా ఉంది. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. ఆయా అంశాల వారీగా టీఆర్ఎస్కు మద్దతునిస్తాం. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే పోరాటాలు నిర్మిస్తాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో డబ్బు ప్రభావం భారీగా పెరిగింది. అధికారపార్టీతో సహా ప్రధాన రాజకీయపార్టీలు విచ్చలవిడిగా డబ్బును వెదజల్లాయి. ఈ విషయంలో టీఆర్ఎస్ అందరికన్నా ముందుంది. ఈ ట్రెండ్‌ను అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. స్వతంత్రంగా వ్యవహరించడంతోపాటు కఠిన చర్యలు తీసుకునే అధికారాన్ని ఎన్నికల సంఘానికి లేదా ఏదైనా ప్రత్యేక సంస్థకు కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యంపై.. కమ్యూనిస్టుపార్టీలు ఐక్యంగా లేకపోవడం, ఎవరో ఒకరితో పొత్తులు ఉండటం మా విజయావకాశాలను దెబ్బతీశాయి. బీఎల్ఎఫ్ పరంగా తీసు కున్న సామాజికన్యాయం అంశం చాలా మంచి ఎజెండా. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు సాధించలేకపోయాం. ఈ ఎన్నికల్లోనే వామపక్షాలను కలుపుకు ని పోవాలని మేము చేసి న యత్నం విఫలమైంది. సంస్థాగతంగాబలహీనపడ్డాం సీపీఎం కూడా సంస్థాగతం గా కొంతమేర బలహీనపడింది. అధికారపార్టీ, ఇతర ప్రధాన రాజకీయపార్టీల ప్రలోభాలు, ఆకర్షణ, అధికార రాజకీయాల ప్రభావం మా పార్టీలోని వివిధ స్థాయిల వారిపైనా పడింది. జిల్లాల్లో పార్టీనాయకులు కొందరు అధికార టీఆర్ఎస్లో చేరారు. ఇవన్నీ పార్టీకి నష్టం కలిగించాయి. దాదాపు 3, 4 దశాబ్దాలుగా కమ్యూనిస్టుపార్టీలకున్న ఆదరణ కొంతకాలంగా దిగజారుతోంది. ఈ ట్రెండ్‌ను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో సీపీఎం ఓటమితోపాటు బీఎల్ఎఫ్ వైఫల్యానికి కూడా ఇదే కారణం. మూడున్నర దశాబ్దాలకాలంలో ఒకసారి టీడీపీ, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి టీఆర్ఎస్తో ఇలా పొత్తులు కుదుర్చుకోవడం, సొం తంగా అన్ని సీట్లకు పోటీ చేసే స్థాయికి చేరుకుని ప్రజలకు విశ్వాసం కలిగించకపోవడం వంటివి వైఫల్యాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్పై వ్యతిరేక వైఖరే బీజేపీ, టీఆర్ఎస్లు రెండూ అధికారపార్టీలే. అందుకే ఆ రెండు పార్టీలపై వ్యతిరేక వైఖరితో ముందుకెళ్లే విషయంలోనూ మా రెండు పార్టీలకు పూర్తి స్పష్టత ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలనే విధానాన్ని మా పార్టీ తీసుకుంది. బీజేపీ విధానాలు దేశానికి ›ప్రమాదకరంగా ఉన్నాయి. అదేసమయంలో కాంగ్రెస్ విధానాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీటీడీపీని కూడా కలుపుకుపోతే బాగుంటుందని సీపీఐ సూచించింది. అయితే తెలంగాణలో టీడీపీ బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీచేస్తున్నందున, తెలంగాణలోనూ ఈ మూడుపార్టీలు కలిసి పనిచేయాలన్న మా సూచనను సీపీఐ తిరస్కరించింది. బీజేపీనిఎదుర్కునే శక్తివామపక్షాలకే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం పెరిగి, మతతత్వ విధానాలు, నియంతృత్వధోరణి ప్రబలుతున్న తరుణంలో దానిని అడ్డుకోగలిగి, పోరాడేశక్తి వామపక్షాలకే ఉంది. పోరాటాల ద్వారా, సైద్ధాంతికంగా మతతత్వ బీజేపీని అడ్డుకునే విషయంలో.. రాబోయే రోజు ల్లో దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశముంది. వామపక్షాలు బలపడితే తప్ప దేశానికి రక్షణ ఉండదు. -
వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీని ఓడించాలి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల పాలనలో దేశంలోని సీబీఐ, సుప్రీంకోర్టు, కాగ్, ఆర్బీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను సైతం ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ, సీపీఎం పిలుపునిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా పోటీచేస్తున్నట్టు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఆదివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడారు. భువనగిరి, మహబూబాబాద్ (ఎస్టీ)లలో సీపీఐ, ఖమ్మం, నల్లగొండలలో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం సహకరించుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతునిస్తున్న టీఆర్ఎస్ను కూడా ఓడించాల్సిన అవసరం ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ,సీపీఎం పోటీ చేయని స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించగలిగే బలమైన లౌకిక, ప్రజాతంత్రశక్తులను గెలిపిం చాల్సి ఉందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు సాదాసీదావి కావని తమ్మినేని వీరభద్రం వ్యా ఖ్యానించారు. దేశ ఐక్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బీజేపీని ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగించకూడదన్నారు. సమావే శంలో పల్లా వెంకటరెడ్డి, టి.శ్రీనివాసరావు, బాల మల్లేశ్ (సీపీఐ), చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు(సీపీఎం)పాల్గొన్నారు. -
‘వారు జవాన్లపై దాడి చేయలేదు’
సాక్షి, హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. పుల్వామా ఘటనను ఎందుకు రాజకీయం చేస్తున్నారో తెలియటం లేదంటూ బీజేపీపై మండిపడ్డారు. ఒక మతానికి సంబంధించిన వారు జవాన్లపై దాడి చేయలేదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా పుల్వామాలో జరిగిన సంఘటనను విద్రోహ చర్యగా పేర్కొన్నారు. అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దేశం మొత్తం ఐక్యంగా ఉంటే బీజేపీ మాత్రం రాజకీయం చేయాలని చూస్తోందంటూ మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం ఇది.. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు’ అన్న అమిత్ షా మాటలను తప్పుబట్టారు. సంఘటనను బీజేపీ వాళ్లు రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ సంఘటనతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏమి చేసిందని ప్రశ్నించారు. కాశ్మీర్‌లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఎవరూ ఉగ్రవాదుల ట్రాప్‌లో పడకూడదని కోరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో జవాన్లు చనిపోయారని తెలిపారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. మాది సెక్యులర్ పార్టీ. ఎన్నికల ముందు కేసీఆర్ లాంటి ఫెడరల్ ఫ్రంట్లు చూస్తూనే ఉంటాము. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. వామపక్షాలు పార్లమెంట్లో ఉండేలా కార్యాచరణ రచిస్తున్నాం. ఎన్నికల తరువాత ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడుతుంది. 2019 ఎన్నికల తరువాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేయడంపై సీపీఐతో చర్చలు జరుగుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు. ఎలక్షన్ కమీషన్ అన్ని రాజకీయ పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేయాలి. జనసేన, టీజేఎస్‌తో చర్చలు జరుపుతున్నాం: తమ్మినేని ఎంపీ ఎలక్షన్లలో కలిసి పోటీ చేసే విషయంపై జనసేన, తెలంగాణ జనసమితి పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఎల్‌ఎఫ్‌తో దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. చాడ వెంకట్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. అధికారంలోకి రాకపోయినా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 టీవీ సీపీఎం పార్టీది కాదని, సీపీఎం పార్టీగా తాము ఎలాంటి వ్యాపారాలు చేయలేదన్నారు. విరాళాలు తీసుకుని టీవీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నష్టంలో ఉన్నందున 10 టీవీని అమ్మి వేసినట్లు చెప్పారు. సేకరించిన విరాళాలు తిరిగి ఇస్తున్నామని, తమపై వచ్చిన వార్తలు ,సోషల్ మీడియాలో వచ్చినవి.. ఒక పేపర్లో వచ్చిన వార్తలు సరైనవి కావన్నారు. తాము టీవీ ద్వారా నష్టపోయామని పొలిట్ బ్యూరోకి చెబితే.. 10 టీవీని అమ్మి వేయండని పోలిట్ బ్యూరో సలహా ఇచ్చినట్లు తెలిపారు. -
ఈవీఎంలపై దర్యాప్తు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వ్యక్తమైన అనుమానాలపై ఈసీ దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం, బీఎల్ఎఫ్ డిమాండ్ చేశాయి. ఫలితాలపై బీఎల్ఎఫ్ అభ్యర్థులతో నిర్వహించిన సమీక్షలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపాయి. బుధవారం బీఎల్ఎఫ్ కార్యాలయంలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడుతూ, కొన్ని స్థానాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్ఎఫ్ అభ్యర్థులకు తాము వేసిన ఓట్లు వీవీప్యాట్లలో నమోదైనట్టు పలువురు ఓటర్లు తమ దృష్టికి తెచ్చారని, అయితే ఆయా బూత్‌లలో లెక్కింపు సందర్భంగా తమ అభ్యర్థులకు సున్నా ఓట్లు రావడంతో గోల్మాల్ జరిగిందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈవీఎంలలో జరిగిన గందరగోళం కారణంగా రికార్డయిన ఓటింగ్‌కు ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన వివరాల్లో తేడాలున్నాయన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు కొంత సమయమిస్తామని, అప్పటికీ వాటి అమల్లో విఫలమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్య, వైద్యం, సేద్యం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎల్ఎఫ్ను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఎన్నికలు రావడంతో నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. సామాజిక న్యాయ ఉద్యమాన్ని తుదివరకూ తీసుకెళ్లాలని సమావేశంలో తీర్మానించినట్టు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దు... గతంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో తగ్గించడం సరికాదని తమ్మినేని అన్నారు. రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కూడా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరిస్తేనే ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ... పంచాయతీ ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తామని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనరల్ సీట్లలో కూడా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్కే అనుకూలం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్టు భావిస్తున్నామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. టీఆర్ఎస్కు మేజిక్ఫిగర్ కంటే తక్కువ వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్ పెరిగిన ప్రభావం కూడా టీఆర్ఎస్కు అనుకూలించవచ్చని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. మొదట్లో టీఆర్ఎస్–ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినా, చివరకు టీఆర్ఎస్ పట్ల సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో ఫలితాలు మిశ్రమంగా వచ్చాయన్నారు. ఈ ఎన్నికలపై డబ్బు ప్రభావం తీవ్రస్థాయిలో ఉందని, దానిని అరికట్టడంలో లేదా నియంత్రించడంలో ఈసీ, పోలీసువర్గాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. సీపీఎం–బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) 107 స్థానాల్లో పోటీచేయడం ద్వారా ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం–సమగ్రాభివృద్ధిని ప్రజల్లో చర్చనీయాంశం చేయగలిగామన్నారు. సీపీఎంగా పోటీచేసిన 26 సీట్లలో కనీసం ఒకటి, రెండుస్థానాల్లో, బీఎల్ఎఫ్ అభ్యర్థులు బరిలో నిలిచిన 81 సీట్లలో రెండు, మూడు చోట్ల విజయావకాశాలున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీచేసిన కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తమ ఫ్రంట్‌కు ఓట్లు పడే అవకాశాలున్నాయన్నారు. -
బతుకులు మారాలంటే బీఎల్ఎఫ్ గెలవాలి : తమ్మినేని
సాక్షి, ఎర్రుపాలెం: రాష్ట్రంలోని ప్రజల బతుకులు మారాలంటే బీఎల్ఎఫ్తోనే సాధ్యపడుతుందని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మధిర బీఎల్ఎఫ్ అభ్యర్థి కోటా రాంబాబు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి మండలంలోని మీనవోలు గ్రామంలో బీఎల్ఎఫ్ అభ్యర్థి కోటా రాంబాబుతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు మాత్రమే గెలవాలని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీ ప్రజలను దగా చేశాయని చెప్పారు. దశాబ్దాలుగా పాలించిన పాలక ప్రభుత్వాలు ప్రజల గోడును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని, పేదలకు సేవలు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి దుస్థితి పోవాలంటే రాష్ట్రంలో బీఎల్ఎఫ్ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ప్రజలకు మేలు చేసే బీఎల్ఎఫ్నే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా నాయకులు మాదినేని రమేష్,కోటా అరుణకుమారి, సీపీఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, ఎంపీటీసీలు రామిశెట్టి సుజాత, అనుమోలు ఉషాకిరణ్ తదితరులున్నారు. -
మోసం చేసే పార్టీలకు ఓటు వేయొద్దు: తమ్మినేని వీరభద్రం
సాక్షి, కామారెడ్డి టౌన్: జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి ప్రజలు మరోసారి ఓడిపోవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎ‹ఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు సీఎస్ఐ గ్రౌండ్ నుంచి ఎస్ఆర్ గార్డెన్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే జిల్లా అభివృద్ధి వెనక్కి వెళ్తుందని వివరించారు. ఓటు బిడ్డలాంటిదని, మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే బిడ్డల్ని అమ్ముకున్నట్లేనన్నారు. కడుపునిండా బువ్వ తినాలంటే ప్రతి ఒక్కరూ రైతు నాగలికే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యాపారంగా మారాయని విమర్శించారు. అంబేద్కర్, పూలే, ఆదర్శంగా బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం పూర్తిగా ఉచితం చేస్తామని, కార్మికులకు కనీస వేతనం అమలు చేస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, నిర్మిస్తామని, ఉన్నత చదువుల కోసం సావిత్రి పథకం, బహుజన బువ్వ పథకం, 200 యూనిట్లకు కరెంట్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాములు, సిద్ధరాములు, నవీన్, మోతీరాంగౌడ్, వెంకటిగౌడ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నుంచి ఔట్.. బీఎల్ఎఫ్ నుంచి పోటీ
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెప్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థుల నాలుగో జాబితాను ఆ ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గురువారం విడుదల చేశారు. నాలుగో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ కు బిఎల్ ఎఫ్ పార్టీ ద్వారా సీటు కేటాయించారు. సీపీఎం నుంచి నకిరేకల్ అభ్యర్థిగా ఎన్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన నగేష్‌కి చోటు లభించింది. నాలుగో జాబితాలో ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు, ముస్లీం-5, బీసీ-5, ఎంబీసీలకు ఒకటి చొప్పున సీట్లను ప్రకటించారు. -
119 స్థానాల్లో పోటీ చేస్తాం: బీఎల్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తా మని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బుధవారం బీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. వివరాలను తమ్మినేని మీడియాకు వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను నియమించినట్టు చెప్పారు. మూడునెలల్లో బీఎల్ఎఫ్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. జూలై, ఆగస్టుల్లో నియోజకవర్గస్థాయి బహిరంగసభలను నిర్వహిస్తామన్నారు. సామాజికన్యాయం లక్ష్యంతో పనిచేస్తున్న సీపీఐ కూడా కలసి రావాలని, ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నేతలను కోరామని తమ్మినేని వెల్లడించారు. మంద కృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్య, జస్టిస్ చంద్రకుమార్, చెరుకు సుధాకర్, కోదండరాం వంటివారితోనూ చర్చలు జరుపుతున్నట్టు తమ్మినేని చెప్పారు. బీఎల్ఎఫ్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయమంటే బర్రెలు, గొర్రెలు, చీరలు పంచడం కాదన్నారు. బీఎల్ఎఫ్ ఓసీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. -
బహుజనులకే సీఎం పీఠం
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్రంలో బీఎల్ఎఫ్ (బహుజన లెప్ట్ ఫ్రంట్) వేగంగా విస్తరిస్తోందని, సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం అజెండాను ముందుకు తెచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ, అగ్రవర్ణ పేదలను కలుపుకొని బీఎల్ఎఫ్ సంచలనం సృష్టించనుందని ఆయన చెప్పారు. బీసీలకు 65 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని.. తద్వారా బహుజనులకే సీఎం పీఠం దక్కనుందని తెలిపారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ముఖ్యమంత్రి పదవి బహుజనుల కు ఇస్తామని ప్రకటించే దమ్ము, ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమ మహాజన పాదయాత్ర అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కులాలకు తాయిళాలు ప్రకటించాడని.. గొర్రెలు, పందులు, చేపలు, పరికరాలు ఇస్తామని చెబుతూ ఇదే సామాజిక న్యాయం అంటున్నాడని విమర్శించారు. అయితే, ఇది సామాజిక న్యాయం కాదని, కేవలం సహాయం మాత్రమేనని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో వాటా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, సంపదలో, అన్నింటా అందరికీ వాటా వర్తిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. బీఎల్ఎఫ్ను అధికారంలోకి తెచ్చేందుకు ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ, కోదండరాం తదితరులతో ఇదివరకే అనేక దఫాలుగా చర్చలు కూడా జరిపామన్నారు. ఈ నెల 22న జరిగే బహిరంగ సభలో బీఎల్ఎఫ్ విధివిధానాలను ప్రకటించి మే 1 నుంచి వివిధ జిల్లాల్లో పర్యటనలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉంటారని, అలాగే జూన్‌లో జరిగే జెడ్పీ ఎన్నికల్లో కూడా బీఎల్ఎఫ్ కామన్ గుర్తు సాధించి ఎన్నికల బరిలో దిగుతామని వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పార్టీలు.. ప్రజా సంక్షేమాన్ని అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విస్మరించాయని బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన రైతుల ఆత్మహత్యలు.. టీఆర్ఎస్ హయాంలో మరింత పెరిగిపోయాయన్నారు. బీఎల్ఎఫ్ సమగ్ర తెలంగాణ అభివృద్ధి, సమగ్ర న్యాయం అనే నినాదంలో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సామాజిక నిర్వచనమే లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేస్తూ పాలనలో టీఆర్ఎస్ విఫలమైందని, ఎన్నికలు వస్తే తాము అధికారంలోకి వస్తామని ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు వైద్యానికి తూట్లు పొడిచాయని, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యంపై ఆధారపడి బడ్జెట్‌ను రూపొందించుకుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీలను ప్రైవేట్‌పరం చేస్తుందని, తద్వారా ఉన్నత విద్యను దూరం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర వైస్ చైర్మన్ జలజం సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, నాయకులు జయరాములు, గులాం గౌస్, కిల్లె గోపాల్ పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా దేశ రాజకీయాలు
ఆసిఫాబాద్ క్రైం: దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆసిఫాబాద్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలక వర్గాలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, నిరసన తెలిపిన వారిని హింసిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ నెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలో భవిషత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
25న బీఎల్ఎఫ్ ఆవిర్భావ సభ
హైదరాబాద్: ఇరవై ఎనిమిది పార్టీలతో కలసి ఈ నెల 25న హైదరాబాద్‌లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆవిర్భావ సదస్సు జరగనుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆవిర్భావ సదస్సుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ హాజరవుతారని చెప్పారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సదస్సు పోస్టర్‌ను తమ్మినేని ఆవిష్కరించారు. కార్పొరేటర్ శక్తుల దోపిడీ, అగ్రకులాల పెత్తనాన్ని అడ్డుకోవడానికే ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన గతానికి భిన్నంగా ఏమీ లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే మంత్రి నాయిని, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డ్రామా ఆడుతున్నారని తెలంగాణ లేబర్ పార్టీ అధ్యక్షుడు జి.రమేశ్ విమర్శించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు జానకిరాములు, పీఎల్.విశ్వేశ్వరరావు, మద్దికాయల అశోక్, ఖాన్ షబాదుల్లాఖాన్, డాక్టర్ రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసి, లంబాడీల మధ్య చిచ్చు పెట్టింది వాళ్లే
భద్రాద్రి కొత్తగూడెం : అడవి మీద గిరిజనులకు హక్కు లేదనటం అవివేకమని, ప్రభుత్వ పెద్దలే ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడటం లేదని ప్రశ్నించారు. అఖిల పక్షం ఎందుకు నిర్వహించటం లేదని అడిగారు. ఇలాంటి గొడవలు పాలక వర్గాలకు లాభమేనని, గతంలో మాల, మాదిగల మధ్య చిచ్చు రేపారని గుర్తు చేశారు. ఆదివాసీ, లంబాడీల మధ్య సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్‌ను ఎందుకు చట్టంగా మార్చటం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఈ పాలనలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. గిరిజనుల పోడు భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం కావాలని సీపీఎం కోరుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ గద్దె దించటమే లక్ష్యంగా సీపీఎం ఉద్యమాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో మాఫియాల రాజ్యం
తమ్మినేని వీరభద్రం సంగారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు నిర్మించడం కాదని, సంపద పెరిగినంత మాత్రాన ప్రగతి సాధించినట్లు కాదన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద శక్తులు విజృంభిస్తూ దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గో సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడటం దారుణమని చెప్పారు. ప్రభుత్వమే యథేచ్ఛగా ఇసుక మాఫియాకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసుల అండతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిందన్నారు. ఎస్పీని వదిలేసి ఎస్ఐని బలిచేయడం వింతగా ఉందన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తప్పించుకుంటున్న కేసీఆర్‌ను పదేపదే ప్రశ్నిస్తున్న ఆచార్య కోదండరాంను అరెస్టుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. -
‘కేటీఆర్‌కు ఆ అర్హత లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావులపై వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని వెంకయ్య నాయుడే నిరూపించుకోవాల్సి ఉందన్నారు. మంత్రి పదవిలో ఉండే వారు ప్రైవేటు కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడానికి వీలులేదని, కేటీఆర్ హిమాన్షు మోటార్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ‘1951-పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్’ ఈ విషయాన్ని నిర్ధేశిస్తోందని చెప్పారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో, 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ పన్నుల శాఖకు కంపెనీ తరపున కేటీఆర్ వివరాలను సమర్పించారని అన్నారు. కేటీఆర్ బెదిరింపులతో విమర్శకుల నోళ్లు మూయించలేరన్నారు. నైతిక బాధ్యతతో కేటీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల, జిల్లెల గ్రామాల్లో దళితులపై నిర్బంధం పెరిగిందని ఆరోపించారు. స్వయంగా సిరిసిల్ల ఎస్పీ దళితులను చిత్రహింసలకు గురిచేశారని, వాస్తవాలను అంగీకరించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చౌకబారుగా థర్డ్ డిగ్రీ లేదు, ఉత్త డిగ్రీ లేదంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
‘ఆ మాట వింటేనే సర్కారు భయపడుతోంది’
హైదరాబాద్: నిరసన అనే పదం వింటేనే తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22వ తేదీన జంతర్ మంతర్ వద్ద తెలిపే నిరసనకు దేశ వ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో పాలన చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మఖ్దూమ్ భవన్లో శనివారం ధర్నా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ‘ పౌరహక్కులు- నిర్భంధం’ అనే అంశంపై సెమినార్ జరిగింది. సమాజ హితవు కోరుకునే వారిలో మేధావులు ముందు ఉంటారని ఆయన అన్నారు. అలాంటివారిని గౌరవించు కోవడం బాధ్యతని, దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలనా నడుస్తోందని తమ్మినేని విమర్శించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పాలన సాగుతుందని విమర్శించారు. ధర్నా చౌక్ విషయంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు. కేసీఆర్ సామ్రాజ్యవాద ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారని విరసం నాయకుడు వరవరరావు ఆరోపించారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించిన క్యాంపు కార్యాలయం దగ్గరకు ప్రజలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చౌక్‌గా జంతర్ మంతర్ కొనసాగుతోంది కానీ, ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఫాసిస్టు పద్దతిలో సీఎం కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేయటం వల్ల సమస్యలు సమసి పోతాయి అనుకోవడం సరికాదని,ధర్నా చౌక్‌గా ప్రగతిభవన్ ఎప్పుడో అయిపోయిందన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిదీ అని, జాతీయ స్థాయిలో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెలదామన్నారు. సెక్రెటరియేట్ తరలింపు రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే జరుగుతోందని, దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోదండదాం కోరారు. 22న ఢిల్లీలో జరిగే నిరసనకు అన్ని సంఘాల మద్దతు కూడగట్టి జాతీయ స్థాయిలో ధర్నా చౌక్ అవశ్యకతని చాటి చెబుతామన్నారు. ఈ సెమినార్లో పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో-కన్వీనర్ విశ్వేశ్వరరావు, వరవరరావు, జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష పార్టీల నేతలు, పౌరహక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తమ్మినేని వీరభద్రం అరెస్ట్
హైదరాబాద్: ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రగతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, జాన్ వెస్లీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కేసీఆర్ గద్దె దిగడం ఖాయం
-
విధానాలు మారకుంటే సీఎంనే మార్చేస్తాం
మహాజన పాదయాత్ర సభలో తమ్మినేని వీరభద్రం టేకులపల్లి: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో పిచ్చి పాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇక నీ విధానాలు మార్చుకోకుంటే.. నిన్నే మార్చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం మహాజన పాదయాత్ర గురువారం రాత్రి టేకులపల్లికి చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి.. ప్రాణాలు త్యాగం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బతుకులు మారితేనే రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లని, సీఎం కేసీఆర్ చేప్పే కాకి లెక్కలతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల పరిస్థితి అలాగే ఉందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. -
అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ నంబర్ వన్
సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చొప్పదండి: అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని, హామీల అమలులో ఆయన విఫలమవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి’ పేరుతో చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండికి చేరుకుంది. చొప్పదండిలోని చర్చి లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తమ్మినేని దారి వెంట స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. డబు ల్ బెడ్రూం ఇళ్ల వ్యయం కంటే ప్రకటనల ఖర్చే పెరిగిపోతోందన్నారు. పాదయాత్రలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు సుదర్శన్‌రావు, నాగేశ్వర్రావు, గోపాల్, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బతుకు తెలంగాణ ఎక్కడ?
సందర్భం సీపీఐఎం తెలంగాణ కమిటీ నాయకత్వంలో ‘ మహా జన పాదయాత్ర’ జయప్రదంగా సాగుతోంది. ఇప్పటికే ఈ యాత్ర 14 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సీఎం కేసీఆర్ శపించినట్లుగా ప్రజలు ఈ యాత్రను అడ్డుకోకపోగా అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’ నినాదంతో సాగుతున్న మా యాత్రను ముఖ్యంగా అట్టడుగు కులాల ప్రజలు తమదిగా భావించి, ఆదరిస్తున్నారు. వివిధ రాజకీయ అభిప్రాయాలు కలిగిన సామాజిక ఉద్యమ నేతలు కూడా ఈ యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాది రాజకీయ యాత్ర కాదని మేము ముందే చెప్పాం. మాకు ఓటేయమని అడగటానికో, మా పార్టీలో చేరమని చెప్పటానికో మేము ఈ యాత్ర చేయటం లేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ప్రజల బ్రతుకులు బాగుపడాలి. ఇలా జరగాలంటే భవిష్యత్తు తెలంగాణలో ‘సామాజిక న్యాయం’ పాలకులకు, అన్ని పార్టీలకు ముఖ్య ఎజెండాగా రూపొందాలి. ఎందుకంటే సామాజిక న్యాయంతో మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమౌతుంది. ఇదే మా లక్ష్యం. ఇందుకు ఏం చేయాలి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమిటి? ఈ అంశాలను ప్రజలకు వివరించటం, ప్రజల నుంచి తెలుసుకోవటమే మేం చేస్తున్న పని. కానీ సాక్షాత్తూ సీఎం యాత్ర ప్రారంభానికి ముందే యాత్రను అడ్డుకోవాలని శాపనార్థాలు పెట్టటం, కె. తారక రామారావు మమ్మల్ని ‘గంగిరెద్దుల’తో పోల్చటం, ‘మోకాళ్లపై నడిచినా మీరేమీ సాధించలేరని’ వ్యాఖ్యలు చేయటం చూస్తే తండ్రీ కొడుకుల అహంభావంతో కూడిన అల్పత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన సీఎం కేసీఆర్ పదేపదే ‘బంగారు తెలంగాణ’ అని పలవరిస్తుంటాడు. ఏ పనులు చేస్తే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది? ఆ వివరాలు మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. మా యాత్రలో ఇప్పటికీ దాదాపు 500కు పైగా గ్రామాలు తిరిగాం. ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలు మేము అందుకున్నాం. అందులో ఏ ఒక్కదానిలోనూ ‘ అయ్యా మా ఇంట్లో బంగారం లేదు. ఒక అర తులం బంగారం ఇప్పించండి’ అనే దరఖాస్తు లేదు. పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావాలని మన ప్రజలు కోరుకుంటున్నారు. మాకిచ్చిన వినతిపత్రాల్లో ‘భూమి కావాలనీ, డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనీ, రేషన్ కార్డు తీసేశారనీ, పెన్షన్ రావటం లేదనీ, స్కూళ్లలో టీచర్లు లేరనీ, తరగతి గదులు లేవనీ, మధ్యాహ్న భోజన కార్మికులు తమకు నాలుగు నెలలుగా జీతాలు రావటం లేదనీ, ఇంకా అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ వగైరా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలనీ, రైతులు తమకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలనీ, రుణ మాఫీ పూర్తిగా ఒకేసారి చేయాలనీ ఇలా అనేక తరగతుల ప్రజలు తమ బాధలు, గా«థలు వెళ్లబోసుకుంటున్నారు. అనేక గ్రామాల్లో ‘మాకు కనీసం చచ్చిన వాళ్లను బొందపెట్టేందుకు శ్మశాన స్థలం ఇప్పించండి’ అని దళితులు మొర పెట్టుకుంటున్నారు. ఇదీ తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి. అందువల్ల మన గౌరవ సీఎంకి మొదట అర్థం కావాల్సిం దేమిటంటే మన ప్రజలు కోరుతున్నది ‘బంగారు తెలం గాణ కాదు.. బ్రతుకు తెలంగాణ’ కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిగా ఉండాలి. అంటే ప్రజల బ్రతుకులు మారాలి. మెరుగుపడాలి. అప్పుడే మన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అయినట్లు భావించవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 63 లక్షల ప్రజల్లో 93 శాతం మందిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాలకు చెందిన ప్రజల బ్రతుకులు మారకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అయినట్లు కాదు. అంటే ‘సామాజిక న్యాయం’ అమలే తెలంగాణ అభివృద్ధికి మూలం. రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ కులాల ప్రజలందరికీ సంపదలోనూ, సామాజిక హోదాలోనూ, రాజకీయ అధికారంలోనూ, తమ సంస్కృతీ సంప్రదాయాలకు లభించే గౌరవంలోనూ సమాన వాటా దక్కినపుడే సామాజిక న్యాయం సంపూర్ణమవుతుంది. ఆ దిశగా మన కృషి ఉండాలి. ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తదనుగుణంగానే వాగ్దానాల వర్షం కురిపిం చింది. కానీ రెండున్నరేళ్లు గడిచినా వీటి అమలు ఎక్కడా ప్రారంభమైన దాఖలా కూడా లేదు. గత పాలకులు అనేక సంవత్సరాలుగా ఎన్నికలలో ఓట్ల కోసం వేసిన పాచికల్లాగానే సీఎం కేసీఆర్ హామీలు కూడా ఉన్నాయి తప్ప తెలం గాణలో సామాజిక న్యాయానికి న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి ఏ కోశానా కనపడటం లేదు. మా ‘మహా జన పాదయాత్ర’ ప్రారంభమయ్యాక తిరిగి సీఎం వాగ్దానాల పునరుద్ఘాటన ప్రారంభమైంది. ‘దళితవాడల నుంచే మిషన్ భగీరథ’ బీసీలకు గురుకులాలు’ ‘విదేశీ విద్యకు నిధులు’ ఎంబీసీ సమస్యలపై మంత్రుల సమావేశాలు’ డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం స్థలాల ఎంపిక’ ఇలాంటి ప్రకటనలన్నీ జోరందుకున్నాయి. అయితే అసలు సమస్యేమిటంటే ‘నాన్నా... పులి’ కథ లాగే కేసీఆర్ మాటలు విశ్వసనీయతను కోల్పోతున్నాయి. అందువల్ల మాటల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టే రోజులు ముగిసిపోయాయి. ఇంక చేతల్లో చూపితే - తప్ప కేసీఆర్ పాలనకు గడ్డుకాలం తప్పదు. - తమ్మినేని వీరభద్రం వ్యాసకర్త సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి -
మూఢనమ్మకాలతో అధికారిక గృహప్రవేశమా
సీఎం కేసీఆర్ తీరుపై సీపీఎం విమర్శ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన అధికారిక గృహ ప్రవేశంలో మతమౌఢ్యాలకు, మూఢనమ్మకాలకు తావిచ్చారని ఆయన తీరును సీపీఎం విమర్శించింది. రాష్ట్రపతి భవన్, చిరాన్ ప్యాలెస్‌లను మరిపించేలా రూ.50 కోట్ల ప్రజాధనాన్ని ఇందుకు దుర్వినియోగం చేయడమూ దారుణమేనంది. ఆయన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుపేదలకు 4 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా 9 ఎకరాల స్థలంలో నివాసం నిర్మించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తన అధికార నివాసంలో ఒక మతానికి చెందిన క్రతువులు, యాగాలు చేయడాన్ని వీరభద్రం తప్పుబట్టారు. గవర్నర్ దంపతులు, మంత్రులు ఆయా క్రతువులను పాటించడంతో పాటు, సీఎం కూర్చోవాల్సిన కుర్చీలో ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌స్వామిని కూర్చోబెట్టడం ఆక్షేపణీయమన్నారు. -
హామీలన్నీ బుట్టదాఖలేనా!
మాట తప్పినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి: తమ్మినేని సాక్షి, కౌడిపల్లి/హైదరాబాద్: ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుట్టదాఖలు చేశారని, మాట తప్పినందుకు ఆయన ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. మహాజన పాదయాత్ర శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల సాగుభూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎన్నికల హామీగానే మిగిలిపోయాయని విమర్శించారు. పాదయాత్ర కౌడిపల్లి మండల కేంద్రం సమీపంలో వెరుు్య కిలోమీటర్ల మైలురారుుని దాటింది. ఈ నెల 28న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మెదక్ జిల్లా పొలంపల్లి నుంచి పాదయాత్రలో పాల్గొంటారు. -
‘ఏవోబీ ఘటనపై జుడీషియల్ విచారణ జరపాలి’
శంషాబాద్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర పది రోజులుగా కొనసాగుతోంది. యాత్ర గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎద్దేవా చేశారు. మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ బూటకమని, ఆ ఘటనపై జుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, హింసకు ప్రతీకారం ప్రతిహింస కారాదన్నారు. ప్రజా సమస్యలు ఉద్యమాలతోనే పరిష్కారం కావాలని అన్నారు. జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యం కల్పించటం లేదని విమర్శించారు. వీటన్నిటిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తాము పాదయాత్ర చేపట్టామని చెప్పారు. ఇందులో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాపై ఇప్పుడెందుకు శత్రుత్వం?
హైదరాబాద్: రాజకీయ అవసరాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాలుగా మారుతున్నందుకు స్వాగతించాం..కానీ, కేవలం రాజకీయలాభం ప్రాతిపదికనే జిల్లాల ఏర్పాటు జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలోని 93 శాతం ఉన్న పేదలకు అన్ని సౌకర్యాలు లభించినప్పుడే బంగారు తెలంగాణ అనిపించుకుంటుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలను పట్టించుకోవటం లేదు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ పరమయ్యాయి. అందుకే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా విడుదల చేసి, ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. తమ పార్టీ చేపడుతున్న పాదయాత్రను కోదండరాం లాంటి వారు మద్దతు తెలుపుతుండగా ముఖ్యమంత్రి విమర్శించటం తగదన్నారు. 2004, 2009లో సీపీఎంతో టీఆర్ఎస్ పొత్తుపెట్టుకున్నప్పుడు లేని శత్రుత్వం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం విషయంలో పార్టీ వైఖరి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉందని చెప్పారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల
సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై విపక్షాల విమర్శలు బఫూన్ మాటలని మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మండిపడ్డారు. విపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీపీఎం ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్ రాలేదని, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురించి మాట్లాడటానికి తమ పార్టీ కార్యకర్త చాలని వ్యాఖ్యానించారు. ఇచ్చంపల్లి గురించి తమ్మినేని ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. దళితులు, మైనార్టీల మీద ఆయనది క పట ప్రేమని అన్నారు. తమ్మినేని వల్ల సీపీఎం లాభపడిందో.. నష్టపోయిందో తేల్చుదామని నోముల సవాల్ చేశారు. -
ఆదర్శప్రాయుడు రుక్మిణి రాంరెడ్డి
సాంస్కృతిక సైనికుడు ఆయన ఆశయ సాధన కోసం పాటుపడాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహబూబాబాద్ : ప్రముఖ విద్యావేత్త, రచయిత, కార్టూనిస్ట్ రుక్మిణి రాంరెడ్డి ఆదర్శ ప్రాయుడు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో రాంరెడ్డి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి నాయకులు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యు డు సాదుల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాంరెడ్డి ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలోను, పలు రంగాల్లోను రాణించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సాంస్కృతిక సైనికుడు అని ఆయనను సాంస్కృతిక రంగం ఉన్నంత వరకు ఎవరూ మరిచిపోరన్నారు. కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రాములు, నాయకులు రాజారావు, జి.నాగయ్య, సారంపెల్లి వాసుదేవరెడ్డి, చుక్కయ్య, సీహెచ్.రంగయ్య, శెట్టివెంకన్న, ఆకులరాజు, సూర్నపు సోమయ్య, జి.రాజన్న, ఎస్.రాజమౌళి, డి.రాంమూర్తి, కె.మహేష్, భాగ్య మ్మ, సీతారామ్, రుక్మిణి పాల్గొన్నారు. పార్టీలు మారడం.. చొక్కాలు మార్చినంత సులువైంది చొక్కాలు మార్చినంత సులువుగా నాయకులు పార్టీలు మారుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం జరిగిన విద్యావేత్త రాంరెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు. డబ్బుపై వ్యామోహంతో పాటు స్వార్థం పెరిగిపోయి రాజకీయం అంతా వ్యాపారంగా మారిందని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రభుత్వాలు మారినా పాలనా విధానంలో మార్పు రావడం లేదని, ప్రజలకు మేలు జరుగడం లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో శృతి, సాగర్ ఎ¯ŒSకౌంటర్ జరిగిందని, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 144 సెక్ష¯ŒS విధించడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ ముఖ్యంకాదని తొలుత ప్రజల బతుకులు మారాలన్నారు. విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. రాష్ట్రంలో 3.50 కోట్ల పై చిలుకు జనాభా ఉందని ఆ జనాభాలో ఎస్సీ లు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారని, వారి జనాభాను బట్టి ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలని తమ్మినేని కోరారు. సామాజిక న్యాయం అంటే ఆ వర్గానికి చెం దిన కొంతమంది వ్యక్తులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడం కాదని, ప్రజలకు న్యాయం జరిగే పాలన సాగాలన్నారు. రాజకీయ స్వభా వం మారినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు -
ప్రజలను చైతన్యపరుస్తాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం – మూడోరోజుకు చేరిన పాదయాత్ర ఊట్కూర్ : నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు సాధించేందుకుగాను పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో మూడోరోజు ఆదివారం ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి పాదయాత్ర కొనసాగింది. పాతపల్లి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం, నిడుగుర్తిలో ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతోనే మూడు నియోజకవర్గాలలోని పది మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట డివిజన్ నుంచి వలసలు ఆగాలంటే ఈ ప్రాజెక్టు తప్పక చేపట్టాలన్నారు. దీనిని ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 69 జీఓను ఫేజ్–1గా, 72 జీఓను ఫేజ్–2గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, గరిడి నింగిరెడ్డి; కాంగ్రెస్ నాయకుడు సరాఫ్ కష్ణ, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి కష్ణ, వివిధ పార్టీల నాయకులు గందే చంద్రకాంత్, సలీం, మాధవరెడ్డి, తిమ్మారెడ్డి, శేషప్ప, సత్యనారాయణరెడ్డి, అమ్మకోళ్ల శ్రీనివాస్, సాయిలుగౌడ్, హన్మంతు, నారాయణరెడ్డి, రాంరెడ్డి, సమరసింహారెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెల్లంకిలో సీపీఎం నేతల భిక్షాటన
నల్గొండ : అప్పుల బాధతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంక్షేమానికి తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారాములతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
'పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు’
గోవిందరావుపేట(వరంగల్): కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలన్నీ ఒకప్పుడు ప్రై వేటు లిమిటెడ్ కంపెనీలుగా ఉండేవని, ప్రస్తుతం అవి కుటుంబ లిమిటెడ్ కంపెనీలుగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో శుక్రవారం నిర్వహించిన సీపీఎం సమావేశంలో ఆయన మట్లాడారు. పార్టీలు కార్పొరేట్ శక్తులపై ఆధార పడుతున్నాయన్నారు. అవినీతి, అక్రమాలను అరికట్టలేక, నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించలేక, రైతు ఆత్మహత్యలను నివారించలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు అనవసర విషయూలపై చర్చలకు తెరతీస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కూడా మిగతా పార్టీలకు మినహాయింపు కాదన్నట్లుగా చెత్తా చెదారం మొత్తాన్ని కారులో ఎక్కించుకుంటోందని, ఆ కారు బరువు మోయలేక ఎక్కడో యాక్సిడెంట్ కావడం ఖాయమని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు తుమ్మల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు
నల్గొండ : తన ప్రభుత్వ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. విపక్షాలన్నీ ఏకమవడం సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బుధవారం నల్గొండలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... మావోయిస్టు సిద్ధాంతాన్ని సీపీఎం ఏనాడూ సమర్థించలేదన్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ తమ పార్టీ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకమని తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరవు మండలాలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.... ఛలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణలో 5 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు దాడిని ఆయన ఖండించారు. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వరంగల్ ఎన్‌కౌంటర్‌పై చర్చించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా తాము ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ప్రజా సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. -
'ప్రజలను మభ్యపెట్టేందుకే..'
నర్సంపేట: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ పేరును ప్రతిపాదించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. అభ్యర్థిత్వంపై గద్దర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాజాగా జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా తమ్మినేని ఆరోపించారు. -
'ఎర్రజెండాలు కలవడం ఖాయం'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): ఎప్పటికైనా ఎర్రజెండాలు కలిసిపోవటం ఖాయమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలక పక్షానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని పాలమూరు బస్తీలో జరిగిన ఎంసీపీఐ(యు) నేత ఓంకార్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. వామపక్షాల ఐక్యతను సీపీఎం అంగీకరిస్తుందన్నారు. చీలిపోయి బూర్జువా పార్టీలకు వత్తాసు పలకటం వల్లనే కమ్యూనిస్టులకు ఈ దుస్థితి దాపురించిందని ఆయన అన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చీలిపోయిన వామపక్షాలు చిక్కిపోయాయని, విడిపోయి పడిపోయాయని అన్నారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాండ్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
'దిక్కులేని వారికి చుక్కలు కమ్యూనిస్టులు'
హుజూర్నగర్ (నల్లగొండ): తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేని వారికి దిక్కు చూపిస్తున్న చుక్కలు కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాధనకు సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుంది. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఎల్లప్పుడూ సీపీఎం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భూస్వామ్య దొరల పాలన సాగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినప్పటికీ నిరాకరించారన్నారు. ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకనే అధికార బలంతో ఎదురు దాడికి దిగారన్నారు. నియంతల్లా వ్యవహరించిన వారు కాలగర్భంలో కలసి పోయారని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ్మినేని వీరభద్రం ఈ సందర్భంగా అన్నారు. -
'కేసీఆర్ చేసిన ఉద్యమం దిక్కుమాలిందేనా'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మున్సిపల్ కార్మికులు చేస్తోంది దిక్కుమాలిన సమ్మె అని.. వారికి మద్దతిస్తున్న సంఘాలు దిక్కు మాలినవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడటం సరి కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆనాడు కేసీఆర్ చేసిన ఉద్యమం దిక్కుమాలిందేనా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో కరీంనగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్ష సంఘాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కేసీఆర్ భాష మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధ్ది చెబుతారని హెచ్చరించారు. -
'టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మా పార్టీనే'
జనగామ రూరల్ (వరంగల్ జిల్లా): ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు సీపీఎం ప్రత్యామ్నాయంగా మారిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జనగామలో మంగళవారం తెలంగాణ రైతుల సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే ఎసిరెడ్డి నర్సింహారెడ్డి 24వ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాటంతోనే నాడు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో ప్రజలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగిందన్నారు. సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు సంబరాలు జరుపుకోకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ చోటు చేసుకోని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాలనలోనే అసంతృప్తి మొదలైందని.. దానికి సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నేటికి నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్‌తో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధింపు, నిత్యావసర సరుకుల ధరల అదుపు కోసం చేసిన ప్రయత్నాలు శూన్యమన్నారు. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో వామపక్షాల కూటమి నుంచి బలమైన నాయకుడిని అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
'కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిక్క పనులు చేస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని ఆయన మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు లేకుండా స్వచ్ఛ భారత్ సాధ్యమా ?.. చీపుర్లతో ఫొటోలు దిగితే స్వచ్ఛ భారత్ అవుతుందా అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్నికి తమ్మినేని ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్ నగరంలో కంపునకు సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని... కార్మికులను మాత్రం తిట్టవద్దని నగర వాసులకు తమ్మినేని వీరభద్రం సూచించారు. హైదరాబాద్ నగరంలో మున్సిపల్ కార్మికులు శనివారం చేపట్టిన ధర్నాలో 7 కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ ధర్నాకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతు ప్రకటించాయి. -
రాజన్నను కోర్టులో హాజరుపరచాలి
హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ప్రధానకార్యదర్శి కూర రాజన్న తదితరులకు వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూర రాజన్నను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని తమ్మినేని విజ్ఞప్తిచేశారు. వారిపై ఎలాంటి కేసులున్నా చట్టప్రకారం విచారించాలని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మోదీ పాలన దేశానికి ప్రమాదకరం: తమ్మినేని
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలన దేశానికి ప్రమాదకరమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం నగరంలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశారని, ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని చెప్పారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను ప్రభుత్వం కాలరాసిందన్నారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. వామపక్షాలన్ని కలసి బలం పుంజుకుని గొప్ప ఉద్యమాలు నిర్మించవచ్చునన్నారు. ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను సైతం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.రాములు, డి.జి.నర్సింహారావు, గ్రేటర్ నాయకులు ఎం.శ్రీనివాస్, కె.రవి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని నాల్గో పార్టీగా చేర్చాలి
కృష్ణా జల వివాదంపై సీపీఎం హైదరాబాద్: కృష్ణా జలాల వివాదం లో తెలంగాణను నాలుగవ పార్టీగా చే ర్చాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃపరిశీలించి రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు వర్షాభావం వల్ల తీవ్రకరువుకు గురవుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా తీర్పునివ్వడంవల్ల నికరజలాలు, మిగులు జలాల్లో తెలంగాణకు నష్టం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాగా, గురువారం దేశవ్యాప్తంగా జరగనున్న రవాణా సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దు రాష్ర్టంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపుదలను ఆమోదించవద్దని సీఎం కేసీఆర్‌కు సీపీఎం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. -
కదం తొక్కిన ఎర్రదండు
మధిర: అరుణ పతాకాలు.. రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతుతో పట్టణం ఎరుపెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మధిరలో సీపీఎం జిల్లా 19వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు ముందు నడవగా కార్యకర్తలు వారిని అనుసరిస్తూ కొనసాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక రెడ్డి గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు వైఎస్ఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, సీపీఎం కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణమైన టీవీఎం పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు, బుచ్చిరెడ్డిపాలెం చిన్నారుల కోలాటాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యహితంగా, కార్యకర్తల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీ సీపీఎం ఒక్కటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకెంతో మేలు జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని అన్నారు. తెలంగాణలో 6 నెలల్లో 680 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని బట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇంత మంది రైతులు మరణించినా సీఎం కానీ, ఒక మంత్రి కానీ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలనే మానవత్వం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొరలా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక రైతులు, పరిశ్రమల వారు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఉన్న పాఠశాలలనే తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1956 స్థానికత పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ స్థిరపడిన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు పంపిణీ చేయడమే కాకుండా, భూస్వాముల కోరలు పీకి వారి వద్ద ఉన్న భూమిని కూడా సేకరించి దళితులకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019 ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో డివిజన్ కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, నాయకులు బుగ్గవీటి సరళ, హైమావతి, సోమయ్య, బి.వెంకట్, సుబ్బారావు, సామినేని రామారావు, బండారు రవికుమార్, కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్ పాల్గొన్నారు.