విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల | Nomula Narsimhaiah fire on cpm Thammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల

Published Fri, Oct 14 2016 4:07 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల - Sakshi

విపక్షాలవి బఫూన్ మాటలు: నోముల

 సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై విపక్షాల విమర్శలు బఫూన్ మాటలని మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మండిపడ్డారు. విపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. సీపీఎం ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్ రాలేదని, ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురించి మాట్లాడటానికి తమ పార్టీ కార్యకర్త చాలని వ్యాఖ్యానించారు. ఇచ్చంపల్లి గురించి తమ్మినేని ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. దళితులు, మైనార్టీల మీద ఆయనది క పట ప్రేమని అన్నారు. తమ్మినేని వల్ల సీపీఎం లాభపడిందో.. నష్టపోయిందో తేల్చుదామని నోముల సవాల్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement