'కేసీఆర్ చేసిన ఉద్యమం దిక్కుమాలిందేనా'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మున్సిపల్ కార్మికులు చేస్తోంది దిక్కుమాలిన సమ్మె అని.. వారికి మద్దతిస్తున్న సంఘాలు దిక్కు మాలినవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడటం సరి కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆనాడు కేసీఆర్ చేసిన ఉద్యమం దిక్కుమాలిందేనా? అని ఆయన ప్రశ్నించారు.
శనివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్ష సంఘాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కేసీఆర్ భాష మార్చుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధ్ది చెబుతారని హెచ్చరించారు.