కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలన్నీ ఒకప్పుడు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా ఉండేవని, ప్రస్తుతం .....
గోవిందరావుపేట(వరంగల్): కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలన్నీ ఒకప్పుడు ప్రై వేటు లిమిటెడ్ కంపెనీలుగా ఉండేవని, ప్రస్తుతం అవి కుటుంబ లిమిటెడ్ కంపెనీలుగా మారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో శుక్రవారం నిర్వహించిన సీపీఎం సమావేశంలో ఆయన మట్లాడారు. పార్టీలు కార్పొరేట్ శక్తులపై ఆధార పడుతున్నాయన్నారు.
అవినీతి, అక్రమాలను అరికట్టలేక, నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించలేక, రైతు ఆత్మహత్యలను నివారించలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు అనవసర విషయూలపై చర్చలకు తెరతీస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ కూడా మిగతా పార్టీలకు మినహాయింపు కాదన్నట్లుగా చెత్తా చెదారం మొత్తాన్ని కారులో ఎక్కించుకుంటోందని, ఆ కారు బరువు మోయలేక ఎక్కడో యాక్సిడెంట్ కావడం ఖాయమని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు తుమ్మల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.