మాపై ఇప్పుడెందుకు శత్రుత్వం?
మాపై ఇప్పుడెందుకు శత్రుత్వం?
Published Fri, Oct 14 2016 1:17 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హైదరాబాద్: రాజకీయ అవసరాల కోసం ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాలుగా మారుతున్నందుకు స్వాగతించాం..కానీ, కేవలం రాజకీయలాభం ప్రాతిపదికనే జిల్లాల ఏర్పాటు జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలోని 93 శాతం ఉన్న పేదలకు అన్ని సౌకర్యాలు లభించినప్పుడే బంగారు తెలంగాణ అనిపించుకుంటుందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాగ్దానాలను పట్టించుకోవటం లేదు. విద్య, వైద్య రంగాలు కార్పొరేట్ పరమయ్యాయి.
అందుకే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా విడుదల చేసి, ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. తమ పార్టీ చేపడుతున్న పాదయాత్రను కోదండరాం లాంటి వారు మద్దతు తెలుపుతుండగా ముఖ్యమంత్రి విమర్శించటం తగదన్నారు. 2004, 2009లో సీపీఎంతో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకున్నప్పుడు లేని శత్రుత్వం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం విషయంలో పార్టీ వైఖరి అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉందని చెప్పారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement