
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది తమ పార్టీయేనని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా యువజన సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ మను ధర్మ శాస్త్రాన్ని మాని వర్ణ వ్యవస్థను వీడాలన్నారు. అప్పుడే అన్ని వర్గాల వారిని కలుపుకొని పోగలరంటూ హితబోధ చేశారు. మను ధర్మ శాస్త్రానికి తాము వ్యతిరేకమని, రాబోవు రోజుల్లో మను ధర్మశాస్త్రాన్ని కాలబెడతాం దీనికి బీజేపీ సమర్థిస్తుందా? వ్వతిరేకిస్తుందా? అంటూ సవాలు విసిరారు. రాష్ట్రంలో పరువు హత్యలను తగ్గించడానికి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకొవట్లేదని, ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క హామీని నేరవెర్చక పోగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ విమర్శించారు. నాడు తెలంగాణ ప్రజలను 'ఆంధ్ర పాలన వస్తుందని భయపెట్టి' అధికారం చేపట్టారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment