వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ పేరును ప్రతిపాదించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
నర్సంపేట: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ పేరును ప్రతిపాదించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. అభ్యర్థిత్వంపై గద్దర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాజాగా జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా తమ్మినేని ఆరోపించారు.