
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెప్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) అభ్యర్థుల నాలుగో జాబితాను ఆ ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గురువారం విడుదల చేశారు. నాలుగో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ కు బిఎల్ ఎఫ్ పార్టీ ద్వారా సీటు కేటాయించారు. సీపీఎం నుంచి నకిరేకల్ అభ్యర్థిగా ఎన్సీ(మాదిగ) సామాజిక వర్గానికి చెందిన నగేష్‌కి చోటు లభించింది. నాలుగో జాబితాలో ఎస్సీలకు మూడు, ఎస్టీలకు రెండు, ముస్లీం-5, బీసీ-5, ఎంబీసీలకు ఒకటి చొప్పున సీట్లను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment