మోసం చేసే పార్టీలకు ఓటు వేయొద్దు: తమ్మినేని వీరభద్రం | Vote For Blf Said Tammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

మోసం చేసే పార్టీలకు ఓటు వేయొద్దు: తమ్మినేని వీరభద్రం

Published Sun, Dec 2 2018 1:09 PM | Last Updated on Sun, Dec 2 2018 1:14 PM

Vote For Blf Said Tammineni Veerabhadram - Sakshi

ప్రచార సభలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం 

  సాక్షి, కామారెడ్డి టౌన్‌: జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు వేసి ప్రజలు మరోసారి ఓడిపోవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎ‹ఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌గార్డెన్‌లో శనివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు సీఎస్‌ఐ గ్రౌండ్‌ నుంచి ఎస్‌ఆర్‌ గార్డెన్‌ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే జిల్లా అభివృద్ధి వెనక్కి వెళ్తుందని వివరించారు. ఓటు బిడ్డలాంటిదని, మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే బిడ్డల్ని అమ్ముకున్నట్లేనన్నారు.

కడుపునిండా బువ్వ తినాలంటే ప్రతి ఒక్కరూ రైతు నాగలికే ఓటు వేయాలని కోరారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యాపారంగా మారాయని విమర్శించారు. అంబేద్కర్, పూలే, ఆదర్శంగా బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం పూర్తిగా ఉచితం చేస్తామని, కార్మికులకు కనీస వేతనం అమలు చేస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, నిర్మిస్తామని, ఉన్నత చదువుల కోసం సావిత్రి పథకం, బహుజన బువ్వ పథకం, 200 యూనిట్లకు కరెంట్‌ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రాములు, సిద్ధరాములు, నవీన్, మోతీరాంగౌడ్, వెంకటిగౌడ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement