ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్‌ | congress MLA fired on TRS govt | Sakshi
Sakshi News home page

ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్‌

Published Thu, Jun 29 2017 5:45 PM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్‌ - Sakshi

ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్‌

హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడు వచ్చినా టీఆర్ఎస్ నేతలకు ఓట్లు కాదు.. ఏట్లే పడతాయని విమర్శించారు. సాగునీటి రంగానికి సంబంధించి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పాలపూర్ రంగారెడ్డికి అనుసంధానం చేయడం సరికాదన్నారు.

డిండి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. డిండి పాలమూరు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీఎంకు లేఖ రాసిన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. డిండిని పాలమూరు రంగారెడ్డితో అనుసంధానం చేస్తే ఉద్యమం తప్పదన్నారు. అనుసంధానం జరిగితే అది టీఆర్ఎస్ నేతల వైఫల్యమే అవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement