నన్ను ముట్టుకుంటే తడాఖా చూపిస్తా : జగ్గారెడ్డి
మెదక్: కేసీఆర్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలని చూస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ....తనను ముట్టుకుంటే తడాఖా చూపిస్తానని హెచ్చరించారు.
మరో నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నాడు ప్రారంభిస్తే...దాన్ని ముందుకు కొనసాగించలేని అసమర్థ పాలన సీఎం కేసీఆర్దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. త్వరలో కేసీఆర్ను ప్రజలే పాతరేస్తారని చెప్పారు.