రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
Published Wed, Nov 23 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ అధ్యక్షతన పెద్దశంకరంపేట మండల పరిషత్ సాధరణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రబీ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రియాంక కాలనీలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఎంపీటీసీ నిరసన..
వేసవిలో తాగునీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని పెద్దశంకరంపేట ఎంపీటీసీ సుభాష్‌గౌడ్ సభలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇతర సభ్యులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు వేణుగోపాల్ గౌడ్, మాణిక్‌రెడ్డి, స్వప్న, సర్పంచ్‌లు జంగం శ్రీనివాస్, మధు, కాశీరాం, నర్సింలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement