
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తెలిపారు.
చేవెళ్లరూరల్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తెలిపారు. శనివారం మండలంలోని ఆలూరులో సీపీఐ గ్రామ శాఖ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన సీపీఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అమలు పర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కివేస్తున్నారని వాపోయారు. ఇటీవల కోదండరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఎదురుదాడికి దిగారన్నారు. సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్‌గౌడ్, మైనార్టీ సెల్ చేవెళ్ల అధ్యక్షుడు మక్బూల్, మహిళా సమాఖ్య నాయకురాలు మంజుల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అంజయ్య, ప్రభులింగం, వెంకన్న పాల్గొన్నారు.
సీపీఐ ఆలూరు గ్రామ కార్యదర్శిగా దేవగోని మల్లేశం
ఆలూరు గ్రామ కమిటీని పార్టీ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ గ్రామ కార్యదర్శిగా దేవగోని మల్లేశం, సహాయ కార్యదర్శిగా యాదయ్య, ఏఐవైఎఫ్ అధ్యక్షుడిగా కె. సుదర్శన్, కార్యదర్శిగా శ్రీనువాస్, వ్యవసాయకార్మిక సంఘం అధ్యక్షుడిగా అడివయ్య, రైతు సంఘం అధ్యక్షుడిగా బుచ్చన్న, ఏఐఎస్‌ఎఫ్ కన్వీనర్‌గా సుమలత, జంగయ్, నాయీబ్రహ్మణ సంఘం కన్వీనర్‌గా శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.