'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది'
కాకినాడ : రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. తూర‍్పుగోదావరి జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వం వెంటాడి మరీ కేసులు పెడుతోందన్నారు.
పోలీసు వ్యవస్థను టీడీపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నవారిగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడమని, వైఎస్ జగన్కు అండగా ఉంటామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.