'అమాయకులపై అక్రమ కేసులు'
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోమవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు.
అనంతరం శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రకటనలు చేస్తూనే పోలీసులు కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి కుమారునిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ జరిపి, కేసును ఎత్తివేయాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. డీజీపీని కలిసిన వారిలో నిరంజన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.