చెన్నై: ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తాజాగా తమిళనాడు కూడా చేరింది. మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్ ప్రకటించింది.
తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల ఔట్ లెట్స్ ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్ బంకుల యాజమనుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలు కు వాయిదా వేసినట్టుతెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు.
మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి కమ్యూనికేట్ చేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల మార్జిన్ లపెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్ చర్చిస్తోందన్నారు. దీనిపై అసోసియేషన్ త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్టు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే.
ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకులు మూత
Published Tue, Apr 18 2017 8:03 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement