Sundays
-
ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్ వస్తుందా?
న్యూఢిల్లీ: ‘‘ఆదివారాలు కూడా ఆఫీస్‌కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి’’అంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే విజయం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని, ఏది ఉన్నా ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ నుంచే ఇది అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతేకాదు, ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు మధ్యస్త వేతనం కంటే 534 రెట్లు అధికంగా రూ.51 కోట్ల వేతనాన్ని 2023–24 ఆర్థిక సంత్సరానికి సుబ్రమణియన్ తీసుకోవడంపైనా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘‘వారంలో 90 గంటలా? సండేని సన్ టు డ్యూటీగా ఎందుకు పేరు మార్చకూడదు. వారంలో ఒకరోజు సెలవుదినాన్ని ఒక భావనగా మార్చేయండి’’ అంటూ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కష్టపడి, స్మార్ట్‌గా పనిచేయడాన్ని తాను విశ్వసిస్తానన్నారు. జీవితాన్ని పూర్తిగా కార్యాలయానికే అంకింత చేయడం వల్ల విజయం రాకపోగా, అగ్గి రాజుకుంటుందన్నారు. ఉద్యోగం–జీవితం మధ్య సమతుల్యత అన్నది ఐచి్ఛకం కాదని, తప్పనిసరి అని పేర్కొన్నారు. మారికో చైర్మన్ హర్‡్ష మారివాలా కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని ఎక్స్‌పై వ్యక్తం చేశారు. ‘‘విజయానికి కష్టపడి పనిచేయడం అన్నది కీలకం. ఇందుకు ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. నాణ్యత, ఆ పని పట్ల అభిరుచి విజయాన్ని నిర్ణయిస్తాయి’’అని పేర్కొన్నారు. బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా దీనిపై స్పందించారు. ‘‘ఇది అగ్ర స్థాయి ఉద్యోగుల నుంచి ప్రారంభిద్దాం. ఫలితమిస్తుందని తేలితే అప్పుడు మిగిలిన వారికి అమలు చేద్దాం’’అని పేర్కొన్నారు. -
Bank Holidays December 2022:13 రోజులు సెలవులు
సాక్షి, ముంబై: ఆర్బీఐ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. డిసెంబర్లో వచ్చే రెండు, నాలుగు శనివారాలు 4 ఆదివారాలతో పాటు రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. డిసెంబర్లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశవ్యాప్త సెలవు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్లో బ్యాంకులకు సెలవులు: డిసెంబర్ 3 - శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ , గోవాలో హాలిడే) డిసెంబర్ 4 -ఆదివారం డిసెంబర్ 10- రెండో శనివారం డిసెంబర్ 11 -ఆదివారం డిసెంబర్ 12- సోమవారం (పా టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు) డిసెంబర్ 18 - ఆదివారం డిసెంబర్ 19 - సోమవారం (గోవా లిబరేషన్ డే,గోవాలో సెలవు) డిసెంబర్ 24- శనివారం ( క్రిస్మస్, నాలుగో శనివారం దేశవ్యాప్త సెలవు) డిసెంబర్ 25 - ఆదివారం డిసెంబర్ 26- సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ మిజోరం, సిక్కిం, మేఘాలయలో హాలిడే) డిసెంబర్ 29- గురువారం (గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు,చండీగఢ్‌లో హాలిడే) డిసెంబర్ 30- శుక్రవారం ( యు కియాంగ్ నంగ్వా మేఘాలయలో సెలవు డిసెంబర్ 31 - శనివారం (నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో సెలవు) రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. -
ట్యాంక్‌బండ్‌పై సండే సందడి
సాక్షి, కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు అనుమతివ్వడంతో హుస్సేన్‌సాగర్ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్ చేస్తూ మురిసిపోయారు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్ ఆటవిడుపులో డిప్యూటీ మేయర్... జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్నిక్ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ప్రభాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ట్యాంక్ బండ్: ఆదివారం.. ఆనంద విహారం
-
కొత్తకొత్తగా.. ట్యాంక్‌బండ్.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: అటు హుస్సేన్ సాగర్ అలల హొయలు.. ఇటు చల్లని మలయమారుత వీచికలు.. తథాగతుడి నిర్మల వదనం.. ఆకాశంలో అలా అలా సాగిపోయే మబ్బుల అందం.. వెరసీ భాగ్యనగర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితమైంది. సందర్శకుల సర్గధామమైన ట్యాంక్‌బండ్ ఇందుకు వేదికగా నిలిచింది. నగర వాసుల అపురూప అనుభవాలకు ఆలవాలమైంది. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధింపులో భాగంగా తొలి ఆదివారం సందర్శకులు ఆహ్లాదభరితంగా గడిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అన్ని వర్గాల ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆనందంగా విహరించారు. విద్యుత్ కాంతుల ధగధగల్లో హుస్సేన్‌సాగర్, బుద్ధ విగ్రహం అందాలను వీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ట్యాంక్‌బండ్ ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Glad Hyderabadis welcomed a new look & traffic free tank bund initiative that was piloted today 😊 pic.twitter.com/nsc40hK4P8 — KTR (@KTRTRS) August 29, 2021 Peaceful. ☮️ The Cool breezy air. Tankbund ki Dad tho saradaga ala walk ki ravadam jarigindi. ❤️ Wonderful decision anna @KTRTRS 🥳❤️ pic.twitter.com/54qXP1my5D — Prêē™️ (@AmIPreetham_) August 29, 2021 -
‘ట్యాంక్‌బండ్‌పై విహారం’ రేపటి నుంచే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ ఈ ఆదివారం సాయంత్రం నుంచే పెడ్రస్టియన్ జోన్‌గా మారుస్తున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దీనిపైకి కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం జారీ చేశారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్ మీదుగా ప్రయాణించాల్సిన వాహనాలకు మళ్లింపులు విధించారు. గతంలో పేర్కొన్న వాటికి అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహన చోదకులు ఆ సమయంలో ట్యాంక్‌బండ్ మార్గంలో రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌ని డంపింగ్ సాగర్‌గా మార్చారు.. ► లిబర్టీ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మీదుగా మళ్లిస్తారు. ►తెలుగుతల్లి వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి లిబర్టీ, హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు. ► కర్బాలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు ప్రయాణించే వాహనాలు సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ, డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలి. ► ఇక్బాల్ మినార్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు పాత సెక్రటేరియేట్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం నుంచి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్ వద్ద, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఆంధ్రా సెక్రటేరియేట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ► కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వారికి ట్యాంక్‌బండ్‌పై సెయిలింగ్ క్లబ్ నుంచి చిల్డ్రన్ పార్క్ వరకు, బుద్ధభవన్ వెనుక ఉన్న నెక్లెస్ రోడ్లో, ఎనీ్టఆర్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ కల్పించారు. -
ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకులు మూత
చెన్నై: ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తాజాగా తమిళనాడు కూడా చేరింది. మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్ ప్రకటించింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల ఔట్ లెట్స్ ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్ బంకుల యాజమనుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలు కు వాయిదా వేసినట్టుతెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు. మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి కమ్యూనికేట్ చేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల మార్జిన్ లపెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్ చర్చిస్తోందన్నారు. దీనిపై అసోసియేషన్ త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. -
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
-
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే సెలవు కాదు. ఇక పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలు సెలవును తీసుకోనున్నాయి. మే 14 నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017 మే 14 నుంచి ప్రతి డీలర్ సెలవు తీసుకోవాలని సీఐపీడీ ఆదేశించినట్టు డీలర్స్ కన్సోర్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ చెప్పారు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటరు డీజిల్ పై రూపాయి 65పైసలు, లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల 56 పైసల కమిషన్ ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. ఈ కమిషన్ ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి నిరసనగా వారు ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూస్తామని ప్రకటించారు. అంతేకాక మే 10ని 'నో పర్చేస్ డే' గా చేపట్టబోతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడదని, సీఐపీడీ యాక్టివేట్ లో ఉండే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారాలు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడతాయని తెలిపారు. అసోసియన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సపోర్టు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కూడా ప్రభుత్వం ఎక్కువ డీలర్ కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ మూత పెట్టడం లేదన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సండే ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఆగస్టు 21 నుంచి ఆదివారాలు దేశంలో ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ కు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయాన్నికల్పిస్తోంది. ఏ నెట్ వెర్క్ మొబైల్ కు కానీ, ల్యాండ్ లైన్ కు కానీ అన్ని ఆదివారాల్లో అపరిమిత ఉచిత కాలింగ్ ఆఫర్ కల్పిస్తున్నట్టు టెలికాం శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ట్వీట్ లో నేడు (శనివారం)ట్విట్ చేశారు. మేకిన్‌ఇండియా, డిజిటల్ ఇండియా బలోపేతం చేయడానికి జాతీయ స్ధాయిలో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించినట్టు ట్విట్ చేశారు. అధికారిక సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను ఆగస్టు 15న వెల్లడిచేయనున్నారు. ప్రస్తుతం రూ. 120 అద్దెతో గ 7 గంటలకు 9 గంటల మధ్య దేశంలో ఏ నెట్వర్క్ కు అయినా ఉచిత కాలింగ్ ఆఫర్ చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ 14.35 మిలియన్ వినియోగదారులతో 57 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే నైట్ అన్ లిమిటెడ్ కాలింగ్ ను ఆఫర్ చేసిన సంస్థ మరిన్ని ఆఫర్లతో మరింత చేరువ కావాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఎయిర్టెల్ నెలకు రూ 100 అదనపు నెలసరి రుసుముతో రోజంతా ల్యాండ్‌లైన్ నుండి ఉచిత అపరిమిత కాలింగ్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Unlimited free Calling from BSNL Landline to any Network's Mobile & Landline on All Sundays on Pan India Basis w.e.f. 15th August 2016 — Manoj Sinha (@manojsinhabjp) August 13, 2016 -
ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్‌తో బీఎస్ఎన్ఎల్
మీరట్: ప్రముఖ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు శుభవార్త. బంపర్ ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ఈ ఆగస్టు 15న దూసుకొస్తుంది. ప్రతి ఆదివారం ఏ నెట్ వర్క్‌కు అయిన అపరమితమైన ఉచిత ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్లాన్ ను ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే. ల్యాండ్ ఫోన్ బిజినెస్ ను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఉచిత కాల్ ప్లాన్ కు ఇది అదనం. నైట్ కాలింగ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు తాజాగా సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తుంది.