
సాక్షి, కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు అనుమతివ్వడంతో హుస్సేన్‌సాగర్ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్ చేస్తూ మురిసిపోయారు.
చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్
ఆటవిడుపులో డిప్యూటీ మేయర్...
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్‌నిక్ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్ సీఐ ప్రభాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment