సాక్షి, హైదరాబాద్: అటు హుస్సేన్ సాగర్ అలల హొయలు.. ఇటు చల్లని మలయమారుత వీచికలు.. తథాగతుడి నిర్మల వదనం.. ఆకాశంలో అలా అలా సాగిపోయే మబ్బుల అందం.. వెరసీ భాగ్యనగర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితమైంది. సందర్శకుల సర్గధామమైన ట్యాంక్‌బండ్ ఇందుకు వేదికగా నిలిచింది. నగర వాసుల అపురూప అనుభవాలకు ఆలవాలమైంది. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధింపులో భాగంగా తొలి ఆదివారం సందర్శకులు ఆహ్లాదభరితంగా గడిపారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో అన్ని వర్గాల ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆనందంగా విహరించారు. విద్యుత్ కాంతుల ధగధగల్లో హుస్సేన్‌సాగర్, బుద్ధ విగ్రహం అందాలను వీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ట్యాంక్‌బండ్ ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Glad Hyderabadis welcomed a new look & traffic free tank bund initiative that was piloted today 😊 pic.twitter.com/nsc40hK4P8
— KTR (@KTRTRS) August 29, 2021
Peaceful. ☮️
— Prêē™️ (@AmIPreetham_) August 29, 2021
The Cool breezy air.
Tankbund ki Dad tho saradaga ala walk ki ravadam jarigindi. ❤️
Wonderful decision anna @KTRTRS 🥳❤️ pic.twitter.com/54qXP1my5D
Comments
Please login to add a commentAdd a comment