visitors crowd
-
ప్రకాశం బ్యారేజీపై సందర్శకుల సందడి (ఫొటోలు)
-
ట్యాంక్ బండ్: ఆదివారం.. ఆనంద విహారం
-
‘ట్యాంక్‌బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌ను కేవలం సందర్శకులకు మాత్రమే కేటాయించారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తొలి రోజైన ఆదివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పోలీసులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సందర్శకులతోనూ ఆయన ముచ్చటించారు. ట్యాంక్‌బండ్ వద్ద కొత్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఆదివారం నెలకొన్న వాతావరణం నేపథ్యంలో సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది. గడిచిన ఏడేళ్ల కాలంలో నగరంలో సుందరీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి, విస్తరణకు సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులు అమలయ్యాయి. హైదరాబాద్‌కు ట్యాంక్‌బండ్ ఒక ల్యాండ్‌మార్క్ లాంటిది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కచ్చితంగా దీన్ని సందర్శిస్తారు. ప్రపంచలో ప్రసిద్ధిగాంచిన నగరాలైన చికాగో, న్యూయార్క్, పారిస్‌ల్లో వాటర్ ఫ్రంట్ ఏరియాలన్నీ కేవలం సందర్శకుల కోసమే ఉంటాయి. ఈ రోజు నుంచి ట్యాంక్‌బండ్ వద్దా ఈ విధానం అమలుకావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్ వద్దకు విహారానికి రండి. మీ భద్రత కోసం పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఏర్పాట్లను మరింత పెంచుతున్నాం’ అని అంజనీకుమార్ పేర్కొన్నారు. కొత్వాల్‌తో పాటు మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ తదితర అధికారులూ ఉన్నారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న సందర్శకులతోనూ అంజనీకుమార్ మాట్లాడారు. ఇలా ఉన్న ట్యాంక్‌బండ్‌ను చూసి ఎలా ఫీల్ అవుతున్నారంటూ కొత్వాల్ అడగ్గా... పాండిచ్చేరిలా ఉందంటూ ఓ సందర్శకురాలు సమాధానమిచ్చారు. -
కొత్తకొత్తగా.. ట్యాంక్‌బండ్.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: అటు హుస్సేన్ సాగర్ అలల హొయలు.. ఇటు చల్లని మలయమారుత వీచికలు.. తథాగతుడి నిర్మల వదనం.. ఆకాశంలో అలా అలా సాగిపోయే మబ్బుల అందం.. వెరసీ భాగ్యనగర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితమైంది. సందర్శకుల సర్గధామమైన ట్యాంక్‌బండ్ ఇందుకు వేదికగా నిలిచింది. నగర వాసుల అపురూప అనుభవాలకు ఆలవాలమైంది. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధింపులో భాగంగా తొలి ఆదివారం సందర్శకులు ఆహ్లాదభరితంగా గడిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అన్ని వర్గాల ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆనందంగా విహరించారు. విద్యుత్ కాంతుల ధగధగల్లో హుస్సేన్‌సాగర్, బుద్ధ విగ్రహం అందాలను వీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం పోలీసులు ట్యాంక్‌బండ్ ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Glad Hyderabadis welcomed a new look & traffic free tank bund initiative that was piloted today 😊 pic.twitter.com/nsc40hK4P8 — KTR (@KTRTRS) August 29, 2021 Peaceful. ☮️ The Cool breezy air. Tankbund ki Dad tho saradaga ala walk ki ravadam jarigindi. ❤️ Wonderful decision anna @KTRTRS 🥳❤️ pic.twitter.com/54qXP1my5D — Prêē™️ (@AmIPreetham_) August 29, 2021 -
కశ్మీర్ వెళ్లి తులిప్ అందాలు చూసొద్దామా..
-
అరకులో ట్రాఫిక్ జాం..
సాక్షి, విశాఖపట్నం: భూతల స్వర్గంగా పేర్కొనే విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వరుస సెలవు దినాలు ఉండడంతో అరకు లోయ అందాలు తిలకించేందుకు సందర్శకులు పోటెత్తారు. వీరి వాహనాలు ఆదివారం అధికం కావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సింగూరులో సందడే..సందడి
ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి మూడు గేట్ల ద్వారా మంజీరలోకి నీరు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో వరదనీరు భారీగా చేరుతుండడంతో ఆ నీటి తాకిడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు మంజీర నదిలోకి మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రాజెక్టుకు తరలివచ్చారు. కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో సింగూరుకు తరలివస్తున్నారు. అన్ని దారులు సింగూరు వైపే మళ్లుతున్నాయి. ఆదివారం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్‌తో పాటు పుల్కల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు కి.మీ దూరం నుండే పర్యాటకులు బారులు తీరి కనిపించారు. ప్రాజెక్టు పైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ప్రత్యేకంగా చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొందరు గోల చేయడంతో వారిని ఆపడం పోలీసుల వశం కాకపోవడంతో చివరికి వదిలిపెట్టారు. సెల్ఫీల జోరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు నీళ్లు కనిపించేలా ఫోటోలు దిగడంలో పోటీలు పడడం కనిపించింది. సెల్ఫీలకైతే అంతే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి వీక్షిస్తున్నారు. పార్కు నిండా పర్యాటకులే.. ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న చిల్ర్డన్స్‌పార్కు పర్యాటకులతో నిండిపోయింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చిన వారంతా వెంట క్యారేజ్‌లు తెచ్చుకుంటున్నారు. పార్కులో కూర్చొని భోజనాలు చేసారు.