ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్తో బీఎస్ఎన్ఎల్ | BSNL to offer 'unlimited free calls' on Sundays starting August 15 | Sakshi
Sakshi News home page

ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్తో బీఎస్ఎన్ఎల్

Published Thu, Aug 11 2016 7:40 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్తో బీఎస్ఎన్ఎల్

ఇక అన్లిమిటెడ్ ఉచిత కాల్స్తో బీఎస్ఎన్ఎల్

మీరట్: ప్రముఖ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వినియోగదారులకు శుభవార్త. బంపర్ ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ఈ ఆగస్టు 15న దూసుకొస్తుంది. ప్రతి ఆదివారం ఏ నెట్ వర్క్కు అయిన అపరమితమైన ఉచిత ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్లాన్ ను ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు.

అయితే, ఇది ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే. ల్యాండ్ ఫోన్ బిజినెస్ ను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఉచిత కాల్ ప్లాన్ కు ఇది అదనం. నైట్ కాలింగ్ ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు తాజాగా సరికొత్త ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement