బీఎస్ఎన్ఎల్ సండే ఆఫర్ అదుర్స్ | BSNL To Offer Unlimited Calls On Sundays From August 21 | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ సండే ఆఫర్ అదుర్స్

Published Sat, Aug 13 2016 8:07 PM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

బీఎస్ఎన్ఎల్  సండే ఆఫర్ అదుర్స్ - Sakshi

బీఎస్ఎన్ఎల్ సండే ఆఫర్ అదుర్స్

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు  మరో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఆగస్టు 21 నుంచి ఆదివారాలు దేశంలో ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్  కు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయాన్నికల్పిస్తోంది.    ఏ నెట్ వెర్క్ మొబైల్ కు కానీ, ల్యాండ్ లైన్ కు కానీ  అన్ని  ఆదివారాల్లో  అపరిమిత ఉచిత కాలింగ్ ఆఫర్ కల్పిస్తున్నట్టు టెలికాం శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా  ట్వీట్ లో నేడు (శనివారం)ట్విట్ చేశారు.  మేకిన్ఇండియా, డిజిటల్ ఇండియా బలోపేతం చేయడానికి  జాతీయ స్ధాయిలో  బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించినట్టు ట్విట్ చేశారు. అధికారిక సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలను ఆగస్టు 15న వెల్లడిచేయనున్నారు. 
ప్రస్తుతం రూ. 120  అద్దెతో గ 7 గంటలకు 9 గంటల మధ్య దేశంలో ఏ నెట్వర్క్  కు అయినా ఉచిత కాలింగ్ ఆఫర్ చేస్తోంది.  బిఎస్ఎన్ఎల్ 14.35 మిలియన్ వినియోగదారులతో  57 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే నైట్ అన్ లిమిటెడ్ కాలింగ్ ను ఆఫర్ చేసిన సంస్థ మరిన్ని ఆఫర్లతో  మరింత  చేరువ కావాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఎయిర్టెల్ నెలకు రూ 100 అదనపు నెలసరి రుసుముతో   రోజంతా ల్యాండ్లైన్ నుండి ఉచిత అపరిమిత కాలింగ్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement