అనంతపురం రూరల్ :
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు బుధవారం నుంచి రెండు నెలల పాటు రూ.700 విలువ చేసే ఇన్స్టలేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు నెలసరి అద్దెలో సైతం ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా రూ.49 రాయితీ ఇస్తోందన్నారు. అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ రూ.249కే సంవత్సరం పాటు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.