అగ్రరాజ్యం అమెరికాలో రికార్డ్ స్థాయిలో బ్యాంక్ శాఖలు మూత పడుతున్నాయి. అక్కడి బ్యాంకులు గత నెలలో ఒక్క వారంలో 37 బ్యాంచ్‌లను మూసివేయడానికి అనుమతి కోరాయి. మూసేస్తున్న బ్యాంచ్‌లలో మూడింట రెండు వంతులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీడీ బ్యాంక్, కీబ్యాంక్ శాఖలే ఉన్నాయి.
అమెరికాలో బ్రాంచ్‌లను మూసేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో నిలిచింది. ఇది గత సంవత్సరం దాదాపు 160 శాఖలను మూసేసింది. 2024 మొదటి నెలలోనే 30 బ్రాంచ్‌లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ధోరణి ఇంతటితో తగ్గేలా కనిపించడం లేదు.
యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ’ (OCC) నుంచి సమాచారం ఆధారంగా జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మూత పడిన బ్యాంక్ బ్రాంచ్‌ల వివరాలను డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అమెరికాలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను మూసివేయాలనుకున్నా లేదా కొత్తది ఏర్పాటు చేయాలనుకున్నా ఓసీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ప్రకారం.. గత జనవరి నెలలో మొత్తం 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి. 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికం. మరో వారంలో 41 శాఖలు మూసివేస్తామని అమెరికన్ బ్యాంకులు గత నెలలోనే ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment