రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, ఒక కస్టమర్ నిర్ణీత గడువు లోపల తప్పకుండా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇది జరిగితే లావాదేవీలు చేయడం కుదరదు. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కథనంలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.
కేవైసీ అప్డేట్ అనేది హై రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, మీడియం అండ్ లో (తక్కువ) రిస్క్ కస్టమర్లకు వరుసగా 8, 10 సంవత్సరాల వరకు ఉంటుంది. RBI ప్రకారం, 2019 మే 29న జారీ చేసిన సర్క్యులర్‌ను 2023 మే 4న అప్డేట్ చేసింది. కావున దీని ప్రకారం ఖాతాదారుడు పాన్ కార్డు లేదా ఫారమ్ 16ని అందించనట్లైతే అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంతకంటే ముందు బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కష్టమరలకు హెచ్చరికలు జారీ చేస్తాయి.
అకౌంట్ యాక్టివేట్ చేయడం ఎలా?
కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేసిన అకౌంట్‌ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి.
1) కేవైసీ ఫారమ్‌తో నేరుగా బ్యాంకుని సందర్శించి యాక్టివేట్ చేసుకోవచ్చు
2) మీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా?
ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్..
- బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్ లాగిన్ చేసి, 'KYC' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పైన సూచనలను అనుసరించి మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఫిల్ చేయాలి.
- ఆధార్, పాన్ ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.
- ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత సర్వీస్ నెంబర్ పొందుతారు. దీనికి సంబంధించి ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ వంటివి పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment