
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జియో తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఎఫ్‌డబ్ల్యుఏ విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్‌ను సంపాదించింది.
ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో జియో ఎయిర్‌ఫైబర్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లు 2025 జనవరిలో 4,27,439 ఉండగా ఫిబ్రవరిలో 4,58,372 మందికి పెరిగారు. భారతీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 84% మార్కెట్ వాటా, అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబర్ బేస్‌ను సంపాదించుకుంది.

తన 5జీ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం.. సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడం ద్వారా జియో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారు మూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు మరియు చిన్న వ్యాపారానికి.. గృహ వినోదం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చింది.
జియో ఎయిర్ ఫైబర్.. 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్ళు, 11కి పైగా ఓటీటీ యాప్‌లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సర్వీస్, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. వివిధ వయస్సుల.. నేపథ్యాల నుంచి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ & ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందుతూ డిజిటల్ ఇండియా ప్రయోజనాలను నిజంగా అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది.