తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం | Heavy Rains In Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం

Published Sun, Sep 1 2024 9:48 AM | Last Updated on Sun, Sep 1 2024 12:22 PM

Heavy Rains In Telugu States

Heavy Rains in Telugu States Updates:

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు

  • భారీ వర్షాలు కారణంగా సౌత్‌ సెంట్రల్‌  రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు
  • తెలుగు రాష్ట్రాల మీదగా వెళ్లే 20 రైళ్లు రద్దు 
  • కొన్ని రైళ్లు దారి మళ్లింపు, మరికొన్ని తాత్కాలికంగా రద్దు 
     

తెలుగు రాష్ట్రాలో​ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలో పలు రైళ్లను రద్దు చేశారు. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ఏపీలో పలు చోట్ల కుండపోత కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,05,895 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.

విజయవాడ నగరవాసులను వర్ష భయం వీడలేదు. బిక్కుబిక్కుమంటున్న కొండ ప్రాంత ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొంది. కొండ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. మరోవైపు.. క్రీస్తురాజుపురం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.  కాగా, వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 14 జిల్లాలకు రెడ్‌ అలర్ట్, పది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. 15 అడుగులు దాటి మున్నేరు నది ప్రవహిస్తో​ంది. దీంతో, భయాందోళనలో మున్నేరు నది ప్రాంతం ప్రజలు. మరోవైపు.. నగరంలోని చెరువు బజార్, కవిరాజ్ నగర్, జెడ్పీ సెంటర్ ప్రగతి నగర్, ఖనాపురంలో భారీగా వరద నీరు చేరుకుంది. ఖమ్మం నగరంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement