Mangoes Doorstep-Delivery: కర్నాటక ప్రభుత్వం ఎటువంటి మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు మామిడి పండ్లను విక్రయించడానికి సరి కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. మామిడి అత్యంత రుచికరమైన పండ్లలో ఒకటి. పైగా వేసవిలో విరివిగా లభించేది కూడా. దేశ వ్యాప్తంగా వందలాది మామిడి రకాలు ఉన్నాయి. ఐతే వాటిలో స్థానికంగా ప్రసిద్ధి చెందినవి సేకరించడం కష్టం. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త వెబ్‌సెట్‌ను ప్రారంభించింది.
ఈ మేరకు రాష్ట్రంలో పండించే స్థానిక రకాల మామిడి పండ్లను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కర్ణాటక స్టేట్ మ్యాంగో డెవలప్‌మెంట్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మే 16న మధ్యవర్తులు లేకుండా ఉత్పత్తులను నేరుగా కస్టమర్‌లకు మార్కెట్ చేయడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
దీంతో కస్టమర్లతో రైతులు నేరుగా కనెక్ట్ అవ్వడమే కాకుండా మంచి తాజా పళ్లను కూడా పొందగలుగుతారు. ఈ ఆన్‌లైన్ పోర్టల్ కర్ణాటక ట్రేడ్‌మార్క్ కర్సిరి మాంగోస్ పేరుతో వెళ్తోంది. దీంతో వినియోగదారులు కనిష్ట ధరతో వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడిన రుచికరమైన తాజా మామిడి పళ్లను ఆస్వాదించగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment