ఇంట్లో ఉన్నట్టుండి.. మీ గ్యాస్ స్టౌ భగ్గుమని వెలిగిందనుకోండి! ఎలా ఉంటుంది? ఏ దెయ్యమో.. భూతమో చేరిందని కొందరు అను కుంటారుగానీ.. ఈ కాలంలో అవేవి అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్‌కు అనుసం ధానమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే చాలు. సరిగ్గా ఇదే తరహాలో ఈ మధ్య ఓ కంపెనీకి చెందిన మైక్రోవేవ్ ఓవెన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగా అవి కాస్తా భగ్గుమంటున్నాయంట! ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మైక్రోవేవ్ ఓవెన్లను తమ నియంత్రణలోకి తెచ్చేసుకున్నారు.
ఇంకేముంది.. హ్యాకర్లు ఎప్పుడు కావా లంటే అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను ఆన్/ఆఫ్ చేయడం లేదంటే.. ప్రీహీట్ చేయడం హ్యాకర్లకు వీలైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వేడి ఎక్కువైతే అగ్ని ప్రమాదం కూడా జరగవచ్చు. అంతేనా ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లలోని కెమెరాలతో హ్యాకర్లు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని రహస్యంగా గమనిం చేందుకూ వీలేర్పడింది.
మరి నిజంగా ఇలా జరిగిందా? స్పష్టంగా తెలియదుగానీ.. చెక్‌పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ లోపాన్ని పసిగట్టింది. సదరు కంపెనీని అప్రమత్తం చేసింది. దీంతో తాము నెల రోజుల క్రితమే సాఫ్ట్‌వేర్ లోపాన్ని సరిదిద్దామని కంపెనీ తెలిపింది. గత ఏడాది దాదాపు 8 కోట్ల స్మార్ట్ హోమ్ పరికరాలు అమ్మిన ఈ కంపెనీ వినియోగదారులందరూ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. హమ్మయ్యా.. గండం గడిచిందన్నమాట!
మైక్రోవేవ్ ఓవెన్ భగ్గుమంటే...!
Published Sat, Oct 28 2017 3:30 AM | Last Updated on Sat, Oct 28 2017 3:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment