Gas stove
-
గ్యాస్ స్టవ్‌లతో కూడా ‘ఆస్తమా’!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇప్పటికీ మీరు కట్టెల పొయ్యి ఉపయోగిస్తున్నారా?’ అంటూ అవాక్కవుతాం, గ్యాస్ పొయ్యి వాడని వారిని చూసి. కట్టెల పొయ్యి నుంచి పొగ వస్తుందని, ఆ పొగ వల్ల వంటచేస్తున్న వారు ఉక్కిరిబిక్కిరవుతారని, వారి ఊపిరి తిత్తులు దెబ్బతింటాయని, పైగా ఆ పొగ వల్ల వాతావరణ కాలుష్యం కూడా పెరగుతుందని ఎవరైనా చెబుతారు. అందుకే కట్టెల పొయ్యిలతో నేటికి కుస్తీలు పడుతున్న మహిళలను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఉజ్వల పథకం’ కింద ఇంటింటికి గ్యాస్ స్టవ్ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి గ్యాస్ స్టవ్‌ల వల్ల కూడా పిల్లలకు ఆస్తమా వస్తోందని, వాతావరణ కాలుష్యం కూడా పెరగుతోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ వెలిగించి నేచురల్ గ్యాస్‌ను మండించడం వల్ల మంచి నీలి రంగు మంట వస్తుంది. మంటను ఏ స్థాయిలో పెట్టుకోవాలంటే ఆ స్థాయిలో పెట్టుకోవచ్చు. ఊపిరి తిత్తులను ఉక్కిరిబిక్కిరి చేసే పొగకు అవకాశమే ఉండదు. కానీ మంట వల్ల కూడా కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. అలా వెలువడే కిలో కార్బన్ డయాక్సైడ్తోపాటుగా 34 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్, 79 గ్రాముల నైట్రోజన్ ఆక్సైడ్, ఆరు గ్రాముల సల్ఫర్ ఆక్సైడ్లు విడుదలవుతాయి. (రైతుల ఫేస్బుక్, ఇన్‌స్టా బ్లాక్ : ఫేస్బుక్ స్పందన) ఇక వాతావరణాన్ని కాలుష్యానికి కారణమయ్యే ధూళి లేదా నుసి రేణువులు ‘పీఎం 2.5 (పర్టికులేట్ మ్యాటర్ డయామీటర్‌లో 2.5 మైక్రోమీటర్కన్నా తక్కువ పరిణామం ఉండడం)’ కూడా విడుదలవుతాయి. ఎలక్ట్రిక్ స్టవ్లకన్నా గ్యాస్ స్టవ్‌ల వల్ల నుసి రేణువులు రెట్టింపు విడుదలవుతాయి. అదే కట్టెల పొయ్యిల వల్ల ఈ నుసి రేణువులు ఏడు వందల రెట్లు పెరగుతాయి. ఆ పొయ్యిల వల్ల సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఎక్కువగానే విడుదలవుతుంది. బొగ్గులు, కట్టెల పొయ్యిల కన్నా గ్యాస్ స్టవ్‌లు తక్కువ కాలుష్యాన్ని కలుగ జేస్తాయంటూ వాదించే వారు లేకపోలేదు. పొదలు, అడవులు అంటుకోవడం వల్ల, డీజిల్ వాహనాల వల్ల, కట్టెల పొయ్యిలు, కట్టెల బాయిలర్లు వల్ల, పంట దుబ్బలను తగుల పెట్టడంతోపాటు గ్యాస్ స్టవ్‌ల వినియోగం వల్ల వెలువడే నైట్రోజెన్ డయాక్సైడ్, పీఎం 2.5’ రేణువులతో మనుషుల, ముఖ్యంగా పిల్లల ఊపిరితుత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా లాంటి జబ్బులు వస్తాయి. గ్యాస్ ఈటర్ల వల్ల కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ‘పిల్లలకు సహజంగా వచ్చే ఆస్తమా కన్నా గ్యాస్ కుకింగ్ ఇళ్లలో నివసిస్తోన్న పిల్లల్లో ఆస్తామా వచ్చే అవకాశాలు 42 శాతం పెరిగినట్లు ‘నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఓ సర్వే’లో వెల్లడయింది. అమెరికా ఇళ్లలో గ్యాస్ కూకర్స్ను ఉపయోగించడం వల్ల నైట్రోజన్, డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. గ్యాస్ స్టవ్ వినియోగం వల్ల 80 ఇళ్లలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు మధ్య వయస్కు పిల్లలు ఆస్తమా బారిన పడినట్లు ‘ఆస్ట్రేలియన్ స్టడీ ఇన్ ది లాత్రోబ్ వ్యాలీ’లో వెల్లడయింది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ స్టవ్‌ల వినియోగం వల్ల పిల్లల్లో అస్తమా వచ్చే అవకాశాలు 12.8 శాతం ఉండగా, మంచి వెంటిలేషన్ వల్ల లేదా మంచి చిమ్నీల వల్ల ఆ ప్రమాదాన్ని 3.4 శాతం తగ్గుంచుకోవచ్చు’ అని అడెలేడ్ యూనివర్శిటీలో ఫార్మకాలోజీ సీనియర్ అధ్యాపకులు ఐయాన్ ముస్గ్రేవ్ తెలిపారు. -
మంటల్లో రైలు
లాహోర్: రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో 74 మంది మృత్యువాత పడిన దారుణ ఘటన గురువారం ఉదయం పాకిస్తాన్లో చోటు చేసుకుంది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న తేజ్గామ్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు ప్రయాణీకులు ఉదయం గ్యాస్ స్టవ్‌లపై అల్పాహారం తయారు చేసుకుంటుండగా లియాఖత్పూర్ సమీపంలో ఒక్కసారిగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయని, క్షణాల్లో మంటలు వ్యాపించాయని, దాంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ బోగీల్లో పిల్లలు, మహిళలు సహా దాదాపు 200 మంది వరకు ఉన్నారని, వారిలో అత్యధికులు రాయివింద్ పట్టణంలో జరగనున్న మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నవారేనని తెలిపారు. మృతుల్లో అత్యధికులు ఇస్లాం వ్యాప్తికి కృషి చేసే తబ్లీగీ జమాత్ సంస్థకు చెందినవారేనని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం రాయివింద్ పట్టణంలో ఉందని, అక్కడ ప్రతీ సంవత్సరం తబ్లీజీ జితేమా అనే మత ప్రబోధ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు, మత ప్రచారకులు వెళ్తుంటారని వివరించారు. పేలుళ్లు జరిగిన సమయంలో కొందరు ప్రయాణీకుల వద్ద కిరోసిన్ ఉండటంతో, మంటలు త్వరితగతిన వ్యాపించాయని తెలిపారు. మంటల భయంతో ప్రయాణీకులు వేగంగా వెళ్తున్న రైళ్లోంచి దూకేయడంతో ఎక్కువ మరణాలు సంభవించాయన్నారు. ప్రయాణీకులు గ్యాస్ సిలిండర్లు తీసుకువెళ్లకుండా అడ్డుకోలేకపోవడం రైల్వే సిబ్బంది పొరపాటేనని అంగీకరించారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, గాయపడినవారికి రూ. 5 లక్షలు పరిహారంగా ఇస్తామన్నారు. అయితే, తబ్లీగీ జమాత్ ప్రతనిధులు మాత్రం సిలిండర్లు పేలడం వల్ల ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుళ్లు జరిగాయని వారు తెలిపారు. వైర్లు కాలిన వాసన వస్తోందంటూ బుధవారం రాత్రే రైల్వే సిబ్బందికి తెలిపినా, వారు పట్టించుకోలేదని గాయపడ్డ పలువురు ప్రయాణీకులు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి, కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చాయి. ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాల్లో గుర్తించడానికి వీలులేని స్థితిలో ఉన్నవే ఎక్కువగా ఉన్నాయని లియాఖత్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నదీమ్ జియా తెలిపారు. -
ప్రమాదమా..? ఆత్మహత్యాయత్నమా..?
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణంలోని ఒకటోవార్డు చంద్రంపేటకు చెందిన భీమనపల్లి భూలక్ష్మి, ఆమె కూతురుభాగ్యకు ఆదివారం మధ్యాహ్నం కాలిన గాయాలు అయ్యాయి. గ్యాస్‌స్టౌ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ఎస్సై నరేశ్ కేసు నమోదు చేశారు. అయితే ప్రమాదం కాదని.. మానసిక వేదనతో నిప్పంటించుకుందని, తన కూతురు రక్షించబోగా గాయపడిందని భూలక్ష్మి భర్త భీమనపల్లి అంజయ్య ‘సాక్షి’తో తన అవేదన వ్యక్తం చేశాడు. 80శాతం కాలిన గాయాలున్న భూలక్ష్మిని హుటా హుటిన హైదరాబాద్ ఆస్పత్రికి తరలించానని, కూతురు సిరిసిల్ల ఆసుప్రతిలో చికిత్స పొందుతోందని వివరించాడు. భూ తగాదాలతోనేనా..? అంజయ వివరాల ప్రకారం.. గత నెల 27న సిరిసిల్లలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కోళ్లపురం నర్సయ్య, మ్యాన రాజేశం, అబ్బగోని శ్రీనివాస్, భీమనపల్లి అంజయ్యకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కోళ్లపురం నర్సయ్యను మ్యాన రాజేశం కులంపేరుతో దూషించాడు. దీంతో మ్యాన రాజేశం, అబ్బగోని శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సాక్షిగా భీమనపల్లి అంజయ్య ఉన్నాడని తెలిసిన మ్యాన రాజేశం కక్ష పెంచుకున్నాడు. తన భార్యపై అత్యాచారానికి యత్నించినట్లు అంజయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం భూలక్ష్మికి తెలిసి మనస్తాపంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పడానికి యత్నించిన కూతురు భాగ్యలక్ష్మికి సైతం గా యాలు అయ్యాయి. భూ లక్ష్మిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తలించారు. పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం జిల్లా పోలీసులు వాగ్మూలం తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారు. అక్కడ జడ్జి సమక్షంలో వివరాలు సేకరించారు. వాగ్మూలాన్ని షీల్డ్ కవర్లో పంపిస్తామని జడ్జి చెప్పినట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. ‘చంద్రంపేటలో జరిగిన ఘటనపై బాధిత మహిళ కూతురు భాగ్య ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశాం. గ్యాస్‌స్టౌ అంటించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు వాళ్ల కొడుకు సైతం చెప్పాడు.’ అంటూ ఎస్సై నరేశ్ తెలిపారు. -
మైక్రోవేవ్ ఓవెన్ భగ్గుమంటే...!
ఇంట్లో ఉన్నట్టుండి.. మీ గ్యాస్ స్టౌ భగ్గుమని వెలిగిందనుకోండి! ఎలా ఉంటుంది? ఏ దెయ్యమో.. భూతమో చేరిందని కొందరు అను కుంటారుగానీ.. ఈ కాలంలో అవేవి అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్కు అనుసం ధానమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే చాలు. సరిగ్గా ఇదే తరహాలో ఈ మధ్య ఓ కంపెనీకి చెందిన మైక్రోవేవ్ ఓవెన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగా అవి కాస్తా భగ్గుమంటున్నాయంట! ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మైక్రోవేవ్ ఓవెన్లను తమ నియంత్రణలోకి తెచ్చేసుకున్నారు. ఇంకేముంది.. హ్యాకర్లు ఎప్పుడు కావా లంటే అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను ఆన్/ఆఫ్ చేయడం లేదంటే.. ప్రీహీట్ చేయడం హ్యాకర్లకు వీలైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వేడి ఎక్కువైతే అగ్ని ప్రమాదం కూడా జరగవచ్చు. అంతేనా ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లలోని కెమెరాలతో హ్యాకర్లు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని రహస్యంగా గమనిం చేందుకూ వీలేర్పడింది. మరి నిజంగా ఇలా జరిగిందా? స్పష్టంగా తెలియదుగానీ.. చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ లోపాన్ని పసిగట్టింది. సదరు కంపెనీని అప్రమత్తం చేసింది. దీంతో తాము నెల రోజుల క్రితమే సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దామని కంపెనీ తెలిపింది. గత ఏడాది దాదాపు 8 కోట్ల స్మార్ట్ హోమ్ పరికరాలు అమ్మిన ఈ కంపెనీ వినియోగదారులందరూ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. హమ్మయ్యా.. గండం గడిచిందన్నమాట! -
ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు
► తప్పనున్న పొగ తిప్పలు ► డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు బంద్ ► స్టౌల సరఫరాకు రూ.30.60 లక్షలు ► 450 స్టౌలు సరఫరా.. ఒక్కో దానికి రూ.6,800 ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఇక పొగ కష్టాలు దూరం కానున్నారుు. నాలుగు జిల్లాల్లో కట్టెల పొరుు్యపై వంట తిప్పలు తప్పనున్నారుు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గ్యాస్ స్టౌలపై వంటలు వండాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకోవడంతోపాటు జూన్‌లో గ్యాస్ స్టౌల సరఫరాకు టెండర్లు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఆయూ హాస్టళ్లకు గ్యాస్ స్టౌలు సరఫరా అవుతున్నారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కట్టెల బిల్లులు నిలిపి వేస్తున్నట్లు ఐటీడీఏ ప్రకటించింది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 123 ఆశ్రమ పాఠశాలలు, ఏడు వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో దాదాపు 40 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను ఐటీడీఏ కల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భోజనాల కోసం ఏళ్ల తరబడిగా కట్టెల పొరుు్యలు ఉపయోగిస్తున్నారు. దీంతో సకాలంలో వంటలు కాకపోవడం, కట్టెల కొరతతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1995 నుంచి 2004 మధ్యకాలంలో 96 ఆశ్రమ పాఠశాలలకు దాదాపు రూ.38,81,654 వెచ్చించి గ్యాస్ స్టౌల సౌకర్యం కల్పించారు. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం 2004-08 మధ్య కాలంలో రూ.3,33,300 కేటారుుంచారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆశ్రమ పాఠశాలలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. గ్యాస్ స్టౌలను వినియోగించడంలో సిబ్బంది విఫలమవడం, మరమ్మతులు లేక మూలనపడడం జరిగింది. తాజాగా ఐటీడీఏ మళ్లీ గ్యాస్ స్టౌలపై వంటలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కో స్టౌకు రూ.6,800 వెచ్చించి 450 గ్యాస్ స్టౌల సరఫరాకు జూన్‌లో రూ.30.60 లక్షలకు టెండర్లు నిర్వహించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు స్టౌల సరఫరాకు చర్యలు చేపట్టింది. కట్టెల పేర అక్రమాలకు చెక్ ఆశ్రమ పాఠశాలల్లో వంటల కోసం కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. నిత్యం వార్డెన్లు ఎడ్లబండ్ల సహా యంతో సమీప అటవీ ప్రాంతాల నుంచి కట్టెలు తెప్పిస్తున్నారు. దూరభారాన్ని బట్టి ఒక్కో ఎడ్లబండికి రూ.800 నుంచి రూ.1,200 వరకు చెల్లిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది ఒక నెలలో వంట కోసం తెప్పించిన ఎడ్లబండ్ల కంటే రెండింతలు ఎక్కువగా రాస్తూ నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం ఉండేది కాదు. ఎట్టకేలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేస్తుండడంతో కట్టెల పేరిట జరిగే అక్రమాలకు చెక్ పడనుంది. సిలిండర్ల సంఖ్య పెంచితెనే ఫలితం గతంలో ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ స్టౌలపై వంటలు చేయడం అమలు కావడంతో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఆశ్రమ పాఠశాలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. కొన్నాళ్లకే గ్యాస్ స్టౌలు నిర్వహణ లేక మూలనపడ్డారుు. గ్యాస్ సిలిండర్లు పక్కాదారి పట్టాయి. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే కొందరు తమ సొంత అవసరాలకు ఇళ్లకు తీసుకెళ్లారు. వాటి విషయమై ఆరా తీసే వారు లేకపోవడంతో అప్పట్లో అందించిన సిలిండర్లు.. ఇప్పుడున్న సిలిండర్లకు లెక్క కుదరడం లేదు. మిగిలిన నాలుగైదు సిలిండర్లు మినహా మిగితా వాటి జాడలేదు. ఐటీడీఏ అధికారులు పూర్తి స్థారుులో విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ప్రస్తుతం ఆశ్రమాల్లో విద్యార్థుల సంఖ్య మూ డింతలు పెరిగింది. నాలుగు సిలిండర్లు ఉన్న ఆశ్రమా ల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదీగాక నాలుగు జిల్లాల్లోని ఆశ్రమాలు మారుమూల ప్రాంతా ల్లో ఉన్నారుు. సకాలంలో సిలిండర్లు సరఫరా కాకుంటే విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుంది. సిలిండర్ల సంఖ్య పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు. మంచి నిర్ణయం 1989 నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కుక్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇన్నాళ్లకు ఆశ్రమాల్లో గ్యాస్ పొరుు్యలు ఏర్పాటు చేయడం సంతోషం. కట్టెల పొరుు్యలపై వంట చేస్తుండడంతో నిత్యం పొగ చూరి కుక్‌లకు కంటి వ్యాధులు వస్తున్నారుు. ఇప్పటికే చాలామంది కంటి సమస్యలతో ఉద్యోగాలు మానుకున్నారు. - అక్బర్, కుక్, బాలుర ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ డిసెంబర్ నుంచి గ్యాస్‌పై వంటలు నాలుగు జిల్లాల్లోని ఆశ్రమ, వసతి గృహాలకు గ్యాస్ పొరుు్యలు సరఫరా చేస్తున్నాం. డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు చెల్లించెది లేదని స్పష్టం చేశాం. గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో పలు ఆశ్రమాల్లో కట్టెల పేరుతో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే చాలా ఆశ్రమాలకు పొరుు్యలు చేరారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ పొరుు్యల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.- రాంమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు -
నీటితో మండే పొయ్యి
నీటితో మంటలు ఆర్పవచ్చునని అందరికీ తెలుసు. కానీ... నీళ్లంటే.. రెండు వంతుల హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ అని తెలిసిన వారు మాత్రం దాంతో నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచిస్తారు. కోచీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని విమల్ గోపాల్, రిశ్విన్, ప్రవీణ్ శ్రీధర్ మాదిరిగా అన్నమాట. హైడ్రోజన్ బాగా మండుతుందని, ఆక్సిజన్ మంటను ఎగదోస్తుందనీ తెలిసిన వీరు... కరెంటు సాయంతో నీటిని అక్కడికక్కడే విడగొట్టి మండించగల ఓ సరికొత్త పొయ్యిని అభివృద్ధి చేశారు. ఇంకోలా చెప్పాలంటే... నీళ్లనే వంటగ్యాస్‌లా మార్చారన్నమాట. కోచీలోని స్టార్టప్ విలేజ్‌లో వీరు ఇప్పటికే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేశారండోయ్! ముందుగా హోటళ్లకు అవసరమైన స్టవ్‌లను తయారు చేసి పరీక్షిస్తామనీ, ఆ తరువాత ఈ హైడ్గ్యాస్ స్టౌ అందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు వీరు. గ్యాస్ అక్కడికక్కడే తయారవుతూండటం వల్ల రవాణా చేయాల్సిన పని లేదు.. మండి పేలిపోతుందన్న భయమూ అక్కరలేదని భరోసా కూడా ఇస్తున్నారు. చూద్దాం... ఎప్పుడు వస్తుందో ఈ నీటి గ్యాస్ స్టౌ! -
ఆ గ్యాస్ స్టవ్‌లు ఏమైనట్టు?
⇒ కట్టెలపొయ్యిలతో మధ్యాహ్న భోజన ⇒ ఏజె న్సీల తంటాలు పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో పొగ కష్టాలు తప్పడం లేదు. సర్కారు అందజేసిన గ్యాస్ స్టవ్‌లు అటకెక్కాయి. సిలిండర్లను స్కూల్ గడప దాటించారు. వంటగదులు నిర్మిస్తారని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిరాశే మిగులుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా సర్కారు వంట గదుల ఊసే ఎత్తడ ంలేదు. బడులన్నీ పొగ రాజుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. వంటవారికి కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. 2004-05 విద్యా సంవత్సంరలో ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు మూణ్నాళ్లకే మూలనపడ్డాయి. మరో వైపు సగం పాఠశాలలకు వంటగదులు లేక మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు తంటాలు పడుతున్నారు. పక్కదారి పట్టిన ప్రభుత్వ పొయ్యిలు 2004-05 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన పొయ్యిలు పక్కదారి పట్టాయి. ఆ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప వాటిని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పంపిణీ సమయంలో పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు.. వారి వారి ఇళ్లకు సిలిండర్లు చేరవేసుకున్నారు. పొయ్యిలు మాత్రం కొన్ని చోట్ల పాఠశాలల్లో ఓ మూలన పడేశారు. వీటి నిర్వహణపై పదే పదే విమర్శలు వినిపిస్తున్నా అధికారులు తిరిగి గ్యాస్‌పొయ్యిలు వెలిగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి పరిగి మండలంలో 8 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలకు, దోమలో 3 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక, కుల్కచర్లలో 7 ప్రాథమికోన్నత, 94 ప్రాథమిక, గండేడ్‌లో 7 ప్రాథమికోన్నత, 84 ప్రాథమిక, పూడూరులో 6 ప్రాథమికోన్నత, 39 ప్రాథమిక పాఠశాలలకు మొత్తం 394 పాఠశాలలకు గ్యాస్‌స్టవ్‌లు, సిలిండర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం ఏ ఒక్క పాఠశాలలోనూ సిలిండర్లతో వంటలు చేయడం లేదు. పొగచూరుతున్న పాఠశాల గదులు ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో గదులన్నీ పొగబారి నల్లగా మారుతున్నాయి. మరోవైపు వంటచెరుకు సేకరించేందుకు ఏజెన్సీలు నానా తంటాలు పడుతున్నాయి. సమకూర్చుకున్న పొయ్యిల కట్టెలు పాఠశాలల ఆవరణల్లో, గదుల్లో నిల్వ చేస్తుండటంతో విద్యార్థులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానొస్తే వరండాలో.. లేకుంటే ఆరుబయట అన్న చందంగా విద్యార్థుల మధ్యాహ్నం భోజనం వంట పరిస్థితి తయారయ్యింది. గ్యాస్ పొయ్యిల విషయం తమకు తెలియదని సంబంధిత అధికారులు చెబుతుండటం గమనార్హం. -
మారుతోన్న వంటిల్లు
ఆధునాతన హంగులు.. అందమైన అలంకరణ సాక్షి, హైదరాబాద్: కాలం మారుతోంది. దానికి అనుగుణంగానే అభిరుచులు కూడా మారుతున్నాయి. ఇంటిని ఎంత అందంగా నిర్మించుకోవాలనుకుంటున్నారో అంతే అందంగా వంటిళ్లు, పడకగది తదితర వాటిని ఉంచుకోవాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్టు గతంలో మాదిరిగా టేకు, ఫ్లయివుడ్, డెకోలానికి కాలం చెల్లింది. ప్రస్తుతం మార్కెట్లో ఎండీఎఫ్, (మీడియం డెనిసిట్ ఫైబర్), మరిన్ ఫ్లయ్ (వంద శాతం నీటిని తట్టుకునే రకం) వచ్చేశాయి. ఇందులో పలు రంగులుంటాయి. అభిరుచిని బట్టి ఇంటి మొత్తాన్ని అరలతో మార్చేస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ సామాను పట్టేలా, అది కూడా ఆకర్షణీయంగా ఎక్కడికక్కడ అమరుస్తారు. ప్రస్తుతం మధ్యతరగతి కుటుంబాలు సైతం కిచెన్‌తో పాటు ఇంటీరియల్ డెకరేషన్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఆసక్తి, అభిరుచులకు తగ్గుట్టుగా పలురకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.50 వేల నుంచి రూ.50 లక్షల వరకు వంటిళ్లు, పడక గదిలో అరలు ఏర్పాటు చేసుకోవచ్చు. ధరలను బట్టి సామాగ్రి మారుతుంటుంది. గత ఐదేళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు నిర్మించే ప్రతి ఇంట్లోనూ అధునాత వంటిళ్లు, పడకగది, ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. స్థాయిని బట్టి వంటిళ్లును మార్చుకునేందుకు వీలుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు.. వంటింటిలోని సామాగ్రి బయట కనబడకుండా, సులువుగా తీసుకునేలా రూపుదిద్దుతున్నారు. వంటింట్లో ప్రధానమైన గ్యాస్ స్టవ్‌ను మార్చేస్తున్నారు. ఇందులో రూ.9 వేల నుంచి మొదలుకొని రూ.25 వేల వరకు ఉన్నాయి. దీంతో వంట సమయంలో పొగబయటకు రాదు. దీంతో పాటు వంట సామాగ్రి చెంచాలు, కప్పులు, ప్లేట్లు వేర్వేరుగా పెట్టుకునేందుకు అరలను అమరుస్తారు. ఇందులో ఏ ఒక్కటి బయటకు కనబడదు. వంటింట్లో ఏమాత్రం స్థలాన్ని వృథా పోనీయకుండా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. లిమెన్స్కార్నర్, పుల్ అవుట్, టాల్ యూనిట్ ఇలా రకరకాల వాటిని మన అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో అర 50 కిలోల బరువును ఆపేలా ఉంటాయి. వేడి, నీటిని తట్టుకునేలా ఉంటాయి.