భార్యను అమ్మకానికి పెట్టాడు! | He was not for sale! | Sakshi
Sakshi News home page

భార్యను అమ్మకానికి పెట్టాడు!

Published Mon, Feb 10 2014 11:55 PM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

భార్యను అమ్మకానికి పెట్టాడు! - Sakshi

భార్యను అమ్మకానికి పెట్టాడు!

 ఈబే (eBay)... ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలకూ కొనుగోళ్లకూ జనప్రియంగా మారిన వెబ్‌సైట్ ఇది. ‘మీ దగ్గరున్న పాత, కొత్త వస్తువులను మా వెబ్‌సైట్‌లో పెట్టండి, మంచి రేటుకు అమ్మేసుకోండి’ అంటూ జనాలకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఓ మగమహారాజు ఈ మధ్య... ఏకంగా తన భార్యనే ఈబేలో అమ్మకానికి పెట్టాడు!

 బ్రిటన్‌కు చెందిన షాన్... తన భార్యను అమ్మేస్తున్నానంటూ ఆమె ఫొటోలను ఈబే సైటులో అప్‌డేట్ చేశాడు. ‘నచ్చిన వాళ్లు కొనుక్కోండి, మంచి తరుణం మించిన దొరకదు’ అంటూ హడావుడి మొదలెట్టాడు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికి ఆమెను ఇచ్చేస్తానన్నాడు. విచిత్రం ఏమిటంటే... షాన్ తన భార్యను వేలానికి పెట్టిన కొన్ని గంటల్లోనే ఆమె కోసం 50 మంది మగ మహారాజులు బిడ్డింగ్ చేశారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియా కంట పడింది. ఇంకేముంది...  దీని గురించి కథనాల మీద కథనాలు వేయడం మొదలైంది.

దాంతో షాన్ అడ్డంగా బుక్కయ్యాడు. ‘ఏదో సరదాగా ఈ పని చేశాను. పైగా ఈ విషయం నా భార్యకు కూడా తెలుసు’ అంటూ బిక్కమొగం వేశాడు షాన్. ఆ విషయాన్ని అతడి భార్యకూడా ధ్రువీకరించింది. వీరి సరదా గురించి బిడ్డింగ్ చేసిన వారికి చెబితే... ‘మేం మాత్రం సీరియస్‌గా ట్రై చేశామా ఏంటి, సరదాగానే చేశాం’ అంటూ తేల్చేశారు వాళ్లు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement