* పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు ఆస్పత్రుల ఎంపిక
* గాంధీ, కింగ్‌కోఠి మెటర్నిటీ, విశాఖ కింగ్‌జార్జి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి
* రూ.25 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
* మొత్తం రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఆస్పత్రుల (ఇ-ఆస్పత్రులు) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇ-ఆస్పత్రులంటే కొత్తగా నిర్మించేవి కాదు. ఉన్న ఆస్పత్రులనే కంప్యూటరీకరిస్తారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులను కంప్యూటరీకరిస్తారు. పైలట్ ప్రాతిపదికన ముందుగా తెలంగాణలో గాంధీ, కింగ్‌కోఠి మెటర్నిటీ ఆస్పత్రి, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కింగ్‌జార్జి, పార్వతీపురంలో ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేశారు. దీనికోసం తొలిదశలో రూ.25 కోట్లు మంజూరు చేశారు. రెండు రాష్ట్రాల్లోని మొత్తం ఆస్పత్రుల్లో కంప్యూటర్ సేవలు అందించాలంటే సుమారు రూ.300 కోట్లు అవుతుందని అంచనా.
ఇ-ఆస్పత్రుల్లో భాగంగా ఫార్మసీ, లేబొరేటరీ, శస్త్రచికిత్సలు, వైద్యుల హాజరీ తదితర 37 రకాల సేవలను ఆన్‌లైన్ చేస్తారు. ఈ విధానాన్ని ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో అమలు చేస్తున్నారు. వైద్యుల నియామకం, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రుల్లో ల్యేబొరేటరీ వసతులు, మౌలిక వసతులు, ఎక్స్‌రే, స్కానింగ్ ఇలాంటివి ఏర్పాటు చేయకుండా ఆస్పత్రులను కంప్యూటరీకరిస్తే ఫలితం ఏమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఆంధ్ర, తెలంగాణల్లో ఇ-ఆస్పత్రులు
Published Sat, Aug 23 2014 3:23 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM
Advertisement
Advertisement