అనంతపురం : అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1200 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.