డాంగిల్ సైజులో కంప్యూటర్ | Dangil sized computer | Sakshi
Sakshi News home page

డాంగిల్ సైజులో కంప్యూటర్

Published Sat, Jun 20 2015 1:23 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

డాంగిల్ సైజులో కంప్యూటర్ - Sakshi

డాంగిల్ సైజులో కంప్యూటర్

ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న ఐబాల్.. ‘స్ప్లెండో’ పేరుతో డాంగిల్ సైజులో మినీ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది.

ఐబాల్ స్ల్పెండో ః రూ.8,999
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న ఐబాల్.. ‘స్ప్లెండో’ పేరుతో డాంగిల్ సైజులో మినీ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. హెచ్‌డీఎంఐ పోర్ట్ సౌకర్యం ఉన్న టీవీకి దీనిని అనుసంధానిస్తే చాలు. టీవీ కాస్తా కంప్యూటర్‌లా, స్మార్ట్ టీవీలా మారిపోతుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ఐబాల్ ఈ పరికరాన్ని రూపొందించింది. వైర్‌లెస్ కీబోర్డు, మౌస్ ఉచితం. ధర రూ.8,999. ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను దీనికి పొందుపరిచారు. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ సౌకర్యం ఉంది.

హెచ్‌డీ గ్రాఫిక్స్, మల్టీ చానెల్ డిజిటల్ ఆడియో, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, రెగ్యులర్ యూఎస్‌బీ పోర్ట్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. అందుబాటు ధరలో లభించే చిన్న సైజు ఉపకరణాలను వినియోగించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని ఐబాల్ డెరైక్టర్ సందీప్ పరస్‌రామ్‌పురియా ఈ సందర్భంగా తెలిపారు. ఉపకరణంపై ఏడాది వారంటీ ఉంది. జూలై నుంచి మార్కెట్లో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement