ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... కాలపరిమితి ముగిశాక వాటివల్ల పర్యావరణానికి అంతే చేటు జరుగుతోంది. ఇలా కాకుండా వినియోగం తర్వాత అవి నిరపాయకరంగా కరిగిపోతే? అద్భుతంగా ఉంటుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... కాలపరిమితి ముగిశాక వాటివల్ల పర్యావరణానికి అంతే చేటు జరుగుతోంది. ఇలా కాకుండా వినియోగం తర్వాత అవి నిరపాయకరంగా కరిగిపోతే? అద్భుతంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పదార్థాలను అభివృద్ధి చేయగలిగితే ఇది సాధ్యమేనంటున్నారు అయోవా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రెజా మోంటజామీ.
ఈ దిశగా తాము ఇప్పటికే బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఆధారిత పదార్థాలు కొన్నింటిని తయారు చేశామని, వీటిని ఎలక్ట్రానిక్ పరికరాల్లో రెసిస్టిర్, కెపాసిటర్, యాంటెన్నాలుగా వాడుకోవచ్చునని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక పదార్థాలు ఎంత వేగంతో నాశనం కావాలో కూడా మనమే నిర్ణయించవచ్చు. తాము ఇప్పటికే రెసిస్టర్, కెపాసిటర్లతోపాటు, కరిగిపోయే ఎల్‌ఈడీ బల్బు, సర్క్యూట్‌ను అభివృద్ధి చేశామని, ట్రాన్సిస్టర్ టెక్నాలజీపై ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని రెజా వివరించారు. ‘ట్రాన్సియెంట్ ఎలక్ట్రానిక్స్’గా పిలుస్తున్న ఈ విధానం మరింత