నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు | The first electronic court | Sakshi
Sakshi News home page

నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు

Published Fri, Aug 16 2013 2:48 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

The first electronic court


 ముంబై:నగరంలో బాంబే హైకోర్టుకు చెందిన తొలి ఎలక్ట్రానిక్(ఈ) కోర్టును రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం ప్రారంభించారు. జస్టిస్ నితిన్ జందార్ ఆధ్వర్యంలో ఈ-కోర్టు పనిచేసే తీరును ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షాతో పాటు బాంబే హైకోర్టు న్యాయవాదులందరూ దగ్గరుండి వీక్షించారు. మొదటగా కంపెనీలకు సంబంధించి కేసులు విచారణకు వస్తాయని, ఆ తర్వాత ఇతర కేసులను కూడా విచారించనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
 
 బాంబే హైకోర్టు భవనంలోని కోర్టు గది నంబర్ 47లో తొలి కేసును విచారించారు. ఈ కేసు విచారణ తీరును సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీక్షించారు. ఈ-కోర్టు గదిలో నితిన్ జందార్ టేబుల్‌పై ఫైల్‌లకు బదులుగా ఓ కంప్యూటర్ ఉంది. వ్యాజ్యదారుల ప్రయోజనార్ధం అదే కోర్టులో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్‌లో జందార్ కంప్యూటర్‌లో ఏ పేజీలు పరిశీలిస్తున్నారో అనేది కూడా కనిపించనుంది. ఎలక్ట్రానిక్ పత్రాల(పీడీఎఫ్, వర్డ్ ఫైల్)ను పెన్‌డ్రైవ్, సీడీలో కోర్టుకు పిటిషన్‌దారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ కోర్టు ఫీజు చెల్లింపులకు మంచి స్పందన లభించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా, సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్టులను ప్రోత్సహిస్తోంది. వచ్చే యేడాది మార్చి 31 నాటికి 969 కోర్టు కాంప్లెక్స్‌ల్లోని 2,249 కోర్టులను కంప్యూటరీకరణ చేయాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement