
సాక్షి, హైదరాబాద్: దుకాణ యాజమానులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నకిలీ అనే పదం ఎక్కువగా నేడు సమాజంలో వినపడుతుంది. అలాగే నకిలీ డీడీలను వాడుతూ విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వర్ అలీ అనే వ్యక్తి హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలలో తిరుగుతూ నకిలీ డీడీలతో విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవాడు.
ఇతని మోసాలు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతాకు చెందిన సర్వర్ అలీ అనే నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి మూడు లాప్ టాప్‌లు, ఐదు సెల్ ఫోన్లు, రెండు ప్రింటర్లు, పలు నకిలీ డీడీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన అభిజిత్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment