‘గురుత్వ’ మూలాలను కనిపెట్టే టెలిస్కోప్
వాషింగ్టన్: గురుత్వతరంగాల మూలాలను గుర్తించే పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. అత్యంత శక్తివంతమైన కాంతి కణాలను నాసా శాస్త్రవేత్తలు ఫెర్మి గామా రే అంతరిక్ష టెలిస్కోప్‌లో కనుగొన్నారు. వీటి ద్వారా గురుత్వాకర్షణ తరంగాల మూలాలను కచ్చితంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గతేడాది సెప్టెంబర్ 14న తొలిసారిగా గురుత్వ తరంగాలకు సంబంధించి ఉనికిని గుర్తించడంలో కొద్దిమేరకు పురోభివృద్ధి సాధించారు. కాగా, ప్రస్తుతం ఆకాశంలో సెకనులో సగం వంతు సమయంలో గామా కిరణాలను టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. టెలిస్కోప్‌లో గుర్తించిన ఈ కాంతి శక్తి రెండు నుంచి మూడు ఎలక్ట్రానిక్ వోల్ట్‌లు ఉంటుందని వారు తెలిపారు.