ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు
పులివెందుల రూరల్:
ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఎంతో అవసరమని అనంతపురం జేఎన్‌టీయూ రెక్టార్ ప్రొఫెసర్ పాండు రంగడు అన్నారు. పట్టణంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీఈ విభాగంలో ‘శ్యాండ్ అన్ లైనింగ్ ప్రోగ్రాం ఆన్ ఎంఎస్‌పీ 430 అండ్ టీఐవీఏ మైక్రో కంట్రోలర్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పరిశోధన రంగంలో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఈసీఈ హెచ్‌వోడీ చంద్రమోహన్‌రెడ్డి, అధ్యాపకులు అపర్ణ, తాజ్ మహబూబ్‌తోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.