radical changes
-
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు
పులివెందుల రూరల్: ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఎంతో అవసరమని అనంతపురం జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ పాండు రంగడు అన్నారు. పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీఈ విభాగంలో ‘శ్యాండ్ అన్ లైనింగ్ ప్రోగ్రాం ఆన్ ఎంఎస్పీ 430 అండ్ టీఐవీఏ మైక్రో కంట్రోలర్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పరిశోధన రంగంలో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఈసీఈ హెచ్‌వోడీ చంద్రమోహన్‌రెడ్డి, అధ్యాపకులు అపర్ణ, తాజ్ మహబూబ్‌తోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎంఎల్ఎస్ @ మల్టీ లెవల్ స్కాం
ఎంఎల్ఎస్ పాయింట్.. అంటే మండల లెవల్ స్టాక్ పాయింట్. ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసరాలను రేషన్ డీలర్లకు సరఫరా చేసే కేంద్రమన్నమాట! డీలర్లు నెలనెలా ఇక్కడి నుంచే నిత్యావసరాలు తీసుకెళ్లి కార్డుదారులకు పంచుతారు. కొందరు అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్ అర్థాన్ని ‘మల్టీ లెవల్ స్కాం’గా మార్చి డీలర్లను యథేచ్చగా దోచుకుంటున్నారు. ఇప్పటికే ఒకపక్క ఈ- పాస్ విధానంతో డీలర్ల పరిస్థితి నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్లు ఉండగా.. మరోపక్క ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి బలవంతపు దక్షిణ వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది. - టంగుటూరు ఎంఎల్ఎస్ పాయింట్ అర్థాన్నే మార్చిన అధికారులు - అన్ని నిత్యావసరాల్లో కోత విధించి సరఫరా చేస్తున్న గోడోన్ ఇన్చార్జి - ప్రశ్నించిన డీలర్లకు గోడౌన్ ఇన్చార్జితో సయోధ్య కుదిర్చిన అక్రమార్కుడు - ఇప్పటికే ఈ-పాస్ విధానంతో ఆర్థిక వెసులుబాటు కోల్పోయి డీలా పడిన డీలర్లు టంగుటూరు : రేషన్ బియ్యం పంపిణీలో జరిగిన సమూల మార్పులతో డీలర్ల అవినీతికి చెక్ పడగా గోడౌన్ ఇన్చార్జి దోపిడీ యథావిధిగా కొనసాగుతోంది. ఒక పక్క అదనపు ఆదాయం లేక డీలాపడిన డీలర్లు.. గోడౌన్ ఇన్చార్జి దోపిడీతో విలవిల్లాడుతున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు అందించే బియ్యం పంపిణీలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ప్రతి రేషన్ షాపునకు ఈ-పాస్ మిషన్లు, ఈ-పాస్ కాటా సరఫరా చేసింది. డీలర్లు వాటి ద్వారే బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు పేదలకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ-పాస్ విధానం ఇప్పటికే సగం గ్రామాల్లో అమలు చేస్తుండగా మరో నెల్లో అన్ని గ్రామాలకు విస్తరించనుంది. ఇప్పటికే రేషన్‌కార్డుల వివరాలు లబ్ధిదారుల ఆధార్‌తో అనుసంధానం చేశారు. కార్డులోని ప్రతి వ్యక్తి వివరాలు ఆధార్ నంబర్లకు అనుసంధానం చే శారు. ఈ-పాస్ విధానంతో ప్రతి షాపు వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. ప్రతి నెలా రేషన్‌షాపులకు గోడౌన్ నుంచి సరఫరా అయ్యే నిత్యావసరాల వివరాలన్నీ అన్లైన్లో ఉంటాయి. వీటి వివరాలు ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు చూసుకునే వెసులుబాటు ఉంది. రేషన్‌షాపులన్నింటినీ అధికారులు తమ కార్యాలయంలో కూర్చొని ఆపరేట్ చేయగల అవకాశం ఉంది. ఈ మొత్తం నేపథ్యంలో డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడ్డట్టయింది. ఎంఎల్ఎస్ పాయింట్‌లోనిలువు దోపిడీ మండల కేంద్రం టంగుటూరులో ఎంఎల్ఎస్ పాయింట్ (మండల లెవల్ స్టాకు పాయింట్) ఉంది. ఈ పాయింట్ నుంచే టంగుటూరుతో పాటు జరుగుమల్లి, కొండపి మండలాలకు బియ్యం, ఇతర సరుకులు సరఫరా అవుతాయి. టంగుటూరు మండలంలో 48 రేషన్ షాపులు, కొండపిలో 30, జరుగుమల్లి మండలంలో 21 షాపుల చొప్పున ఉన్నాయి. డీలర్లను దోచుకునేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ కేంద్ర బిందువుగా మారింది. సెప్టెంబర్ కోటా కింద మూడు మండలాలకు కలిపి 615 టన్నుల బియ్యం అలాట్మెంట్ జరిగింది. అంటే కేజీల్లో చూస్తే 6.15 లక్షల కేజీలు. ఇవి 50 కేజీల బ స్తాల్లోకి మారిస్తే 12,300 బస్తాలు. ఈ 12,300 బస్తాల్లో బస్తాకు అరకేజీ వంతున గూడౌన్ ఇన్చార్జి దోచుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేజీ బియ్యం ధర రూ.27లు. ఒక్క నెలలోనే గోడౌన్ ఇన్చార్జి దోపిడీ రూ.లక్షలో ఉంది. ఈ-పాస్ విధానంతో రెవెన్యూ అధికారుల మామూళ్ల బెడద తొలగిపోగా గోడౌన్ ఇన్చార్జి దోపీడీ పోలేదని డీలర్లు వాపోతున్నారు. ఇటీవల బియ్యం త గ్గించేందుకు డీలర్ల అంగీకరించకపోవడంతో బియ్యం అక్రమ వ్యాపారంలో రాటు దేలిన డీలర్ ఒకరు మధ్యవర్తిగా వ్యవహరించి ఈ సారికి పాత పద్ధతినే అవలంబించాలని ఇన్చార్జి-డీలర్ల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. గోడౌన్ ఇన్చార్జి దక్షిణ..బస్తాకు అరకేజీ! ఈ-పాస్ విధానం, అన్లైన్ పద్ధతులతో అవినీతికి అవకాశాలు సన్నగిల్లి దిగాలు పడిన డీలర్లను గోడౌన్ ఇన్చార్జి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ప్రతి కట్ట బియ్యాని(50 కేజీలు)కి అరకేజీ తగ్గించి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ దోపిడీ ఎంతో కాలంగా కొనసాగుతోంది. పట్టించుకునే దిక్కు లేదు. ఉదాహరణకు ఒక డీలర్‌కు 100 కట్టలు పంపిస్తుంటే అందులో కట్ట తగ్గిస్తారు. ఈ భారం డీలర్ భరించాల్సిందే. -
‘పాలమూరు’లో సమూల మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో సమూల మార్పులు జరుగుతున్నాయి. నిర్ణీత ఆయకట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ముంపు ప్రాంతాలను గణనీయంగా తగ్గిస్తూ నూతన ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రాజెక్టులో అలైన్మెంట్, లెవల్, నాణ్యతను ప్రస్తుతం సర్వే చేస్తున్న అధికారులు ఈ మేరకు రిజర్వాయర్ల సామర్థ్యంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముంపు ఎక్కువగా ఉన్నచోట సామర్ధ్యం తగ్గిస్తూ... వీలైనచోట్ల పెంచుతూ డిజైన్‌కు తుదిరూపమిస్తున్నారు. అన్ని రిజర్వాయర్ల పరిధిలోనూ సర్వే పనులు పూర్తయ్యాకే టెండర్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. ముంపు తగ్గేలా మార్పులు పాలమూరు ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం నుంచి వరద ఉండే 60 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తీసుకొని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు నీటిని తరలించి మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 2.70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం మొత్తంగా ఆరు రిజర్వాయర్లు, 5 లిఫ్టులు ప్రతిపాదించారు. వీటికింద సుమారు 22 వేల ఎకరాల మేర ముంపు ఉంటుందని నిర్ధారించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి 9,488 కోట్లు అవసరమని తేల్చగా, 13,158 ఎకరాల భూసేకరణకు రూ.2,565 కోట్లు వ్యయాన్ని లెక్కకట్టారు. మొత్తంగా రూ.35,200 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమెంది. ప్రస్తుతం రిజర్వాయర్ల పరిధిలో అత్యాధునిక లేజర్ స్కానర్ సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకుంటూ సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగానే పలుమార్పులకు అధికారులు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాలను తగ్గించేలా ఈ మార్పులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్వేన నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలుగా నిర్ధారించగా ప్రస్తుతం దాన్ని 19 టీఎంసీలకే పరిమితం చేశారు. దీనిద్వారా నాలుగైదు తండాలకు ముంపు తగ్గనుంది. ఇక లక్ష్మిదేవుని పల్లి సామర్థ్యాన్ని సైతం 10 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు తగ్గించారు. దీని ద్వారా 4 పెద్ద గ్రామాలు ముంపు బారినుంచి బయట పడతాయి. నాలుగు గ్రామాల పరిధిలోనే సుమారు 14 తండాలు, 2 వేల వరకు జనాభా ఉందని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక నిర్మాణానికి అంత అనువుగా లేని లోకిరేవు ప్రాంతాన్ని మార్చి దానికి సమీపంలోని ఉద్దండాపూర్‌లో అంతే కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక నార్లాపూర్ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 8.8 టీఎంసీల నుంచి 8.5 టీఎంసీలకు తగ్గించేందుకు నిర్ణయించగా, ఏదుల రిజర్వాయర్‌ను 4.3 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీల సామర్ధ్యాన్ని పెంచనున్నారు. సర్వే పూర్తయిన అనంతరం వీటన్నింటిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇండోర్‌కు ప్రభుత్వ బృందం కాగా, పాలమూరు ప్రాజెక్టులో కాల్వల నిర్మాణానికి బదులు భారీ పైప్లైన్లను ఏర్పాటు చేసేందుకు యోచనలు చేస్తున్న ప్రభుత్వం, ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, చీఫ్ ఇంజనీర్లు ఖగేందర్, పురుషోత్తమరాజులు శనివారం నుంచి ఇండోర్‌లో పర్యటించి పైప్‌లైన్ నిర్మాణాలను పరిశీలించనున్నారు. -
‘ఉపాధి’లో ప్రక్షాళన
- ప్రతి ఆవాసంలోనూ తప్పని సరిగా పనులు - పని కావాలన్నా.. వద్దన్నా డిమాండ్ లెటర్ ఇవ్వాల్సిందే - బిల్లుల చెల్లింపుల్లోనూ సమూల మార్పులు - పంచాయతీ కార్యాలయాల నోటీసులో బిల్లుల జాబితా అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. గ్రామాల్లో ఉపాధి లేక వలస పోతున్నామనే మాట ప్రజల నుంచి వినిపించకూడదు అనే లక్ష్యంతో డ్వామా అధికారులు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. వివరాల్లోకి వెలితే... జిల్లాలో ఉపాధిహామీ పథకం అమలు కాని ప్రాంతాల్లో ఎక్కువశాతం మంది పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ అపవాదును దూరం చేయడానికి అధికారులు ప్రక్షాళనతంత్రం చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆవాసప్రాంతాల్లో పనుల కల్పనకు డిమాండ్ లెటర్‌ను కూలీల నుంచి సేకరిస్తున్నారు. అలాగే పనులు వద్దు అన్నా కూడా నో డిమాండ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వలన ఉపాధి పనులు లేకనే వలస పోతున్నారనే మాట రాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూలీలు పని కావాలని డిమాండ్ లెటర్ ఇచ్చినా పని కల్పించకపోతే 24 గంటల్లో సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని కఠినతరమైన ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపుల విషయంలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నారు. పోస్టల్‌శాఖ ద్వారా చేపడుతున్న బిల్లుల చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా కూలీల వేతనాలకు సంబందించి స్లిప్పులు జారీ చేసేవారు. ఇక నుంచి శ్రమశక్తిసంఘాల ద్వారా ఇవ్వనున్నారు. స్లిప్‌లపై తప్పనిసరిగా మండల ఏపీఓ సంతకం, సీల్ వేయాలనే నిబందన విధించారు. దీని వలన బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులకు అడ్డుకట్ట పడనుంది. కూలీలు డబ్బులు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా స్లిప్‌లను జాబ్‌కార్డు, నోట్‌బుక్‌లో అతికించుకోవాలి. అలాగే ప్రతి వారం బిల్లులు తీసుకున్న కూలీల జాబితా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసుబోర్డులో అతికించాలనే నిబందన కూలీలకు ఉపయుక్తంగా మారనుంది. ఎవరెవరు బిల్లులు తీసుకుంటున్నారు.. నకిలీల పేర్లు ఉన్నాయా ? అని అంశాలపై ప్రజలు సైతం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యం : ఉపాధిజాబ్కార్డు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ఉన్నాం. పనిలేక వలస పోతున్నామనే మాట కూలీల నుంచి రాకూడదు. పని అడిగిన 24 గంటల్లో పని కల్పించలేకపోతే సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్‌ను నిర్దాక్షిణంగా తొలగిస్తాం. కావున ప్రతి అవాసప్రాంతం నుంచి డిమాండ్, నో డిమాండ్ లెటర్లను కూలీల నుంచి సేకరిస్తున్నాం. ఈ ఏడాది నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వలస పోకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాగభూషణం,ప్రాజెక్టు డైరక్టర్, డ్వామా -
‘పంచాయతీ’లో విప్లవాత్మక మార్పులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. కేరళలో విజయవంతమైన పంచాయతీ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్న పలు విధానాలను తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలపై అధ్యయనంలో భాగంగా బుధవారం ఆయన తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించారు. మంత్రి పర్యటన వివరాలను ఇక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మణికల్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కమిటీలు, ఇతర సిబ్బంది, ప్రజలతో సమావేశమై ఆయన పలు అంశాలపై చర్చించారు. కేరళలోని గ్రామ పంచాయతీలు తమ అధికారాలను వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కేరళలో కేవలం 964 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం వాటి సంఖ్య 8,400పైనే ఉంటుందన్నారు. సమీకృత గ్రామ పంచాయతీ భవన సముదాయంలోని వసతులను ఆయన పరిశీలించారు. ఒకే చోట పౌర సేవలు అందిస్తున్న తీరును కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్ .. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకర్త, కేంద్ర ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, సీనియర్ అధికారి జేఎం వర్గీస్‌తో భేటీ అయ్యారు. కేరళ నమూనా స్ఫూర్తితో తెలంగాణలో అమలు చేయదగిన కార్యక్రమాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరిం చారు. ‘కేరళ స్థానిక పాలన సేవల పథకం’ వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ని మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.